హయత్‌నగర్ పుడమి స్కూల్లో అన్యువల్ డే పేరుతో పిల్లలతో పనులు చేయిస్తున్న ప్రిన్సిపల్‌పై విమర్శలు
రంగారెడ్డి జిల్లా
హయత్ నగర్ డివిజన్
పున్నమి న్యూస్ ప్రతినిధి
12 మార్చి 2026
హయత్‌నగర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో అన్యువల్ డే కార్యక్రమం పేరుతో చిన్న పిల్లల చేత గిన్నెలు మోయిస్తూ పనులు చేయిస్తున్న ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో చదువుకునే చిన్నారుల చేత భోజన గిన్నెలు మోయించడం, పనులు చేయించడం సరైంది కాదని వారు అంటున్నారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఉండాల్సిన పాఠశాలలో ఈ విధంగా పనులు చేయించడం తగదని స్థానికులు విమర్శిస్తున్నారు.
సంబంధిత అధికారాలు ఈ ఘటనపై దృష్టి సారించి, నిజానిజాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






