Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rangareddy

హబ్సిగూడలో ‘ది బ్లో స్టూడియో సెలూన్’ రెండో బ్రాంచ్ ప్రారంభం

Punnami Newsroom Published:
హబ్సిగూడలో ‘ది బ్లో స్టూడియో సెలూన్’ రెండో బ్రాంచ్ ప్రారంభం

హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8లో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ‘ది బ్లో స్టూడియో సెలూన్’ రెండో బ్రాంచ్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి సెలూన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెలూన్ నిర్వాహకులు సాయికృష్ణ, వారి సతీమణి పూజ (డెనైల్) తదితరులు పాల్గొన్నారు.
కొరియన్ హెయిర్ కటింగ్ ప్రత్యేక ఆకర్షణ
ది బ్లో స్టూడియో సెలూన్‌లో ప్రత్యేకమైన కొరియన్ హెయిర్ కటింగ్ సేవలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా హెయిర్ స్టైల్స్‌తో పాటు హెయిర్ స్పా, హెయిర్ కట్స్, ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్స్, పెడిక్యూర్, మానిక్యూర్, వాక్సింగ్, కెరాటిన్ ట్రీట్‌మెంట్స్ వంటి వివిధ రకాల బ్యూటీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
లగ్జరీ వాతావరణంలో అందుబాటు ధరలకు సేవలు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. వివాహాది శుభకార్యాల కోసం బ్రైడల్ మేకప్, నెయిల్ ఆర్ట్ సేవలు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సెలూన్‌కు మొదటి బ్రాంచ్ కొత్తపేటలో ఉండగా, రెండో బ్రాంచ్‌ను హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8లో ఏర్పాటు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల వినియోగదారులకు ఆధునిక హెయిర్ స్టైలింగ్, బ్యూటీ సేవలు మరింత చేరువయ్యాయి.

హబ్సిగూడలో ‘ది బ్లో స్టూడియో సెలూన్’ రెండో బ్రాంచ్ ప్రారంభం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *