Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rangareddy

బి.ఎన్. రెడ్డి నగర్‌లో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – భక్తులకు అన్నదా

Punnami Newsroom Published: Updated:
బి.ఎన్. రెడ్డి నగర్‌లో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – భక్తులకు అన్నదా

ఎల్బీనగర్: బి.ఎన్.రెడ్డి నగర్‌లో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ రాకర్ట్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తితో పాటు సేవాభావాన్ని చాటిచెప్పేలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రాకర్ట్ యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.

నిర్వాహకులు:
శ్రీ బండారి సంజీవ వంశరాజ్
ఉపాధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా సంచార జాతుల సంఘం

బి.ఎన్. రెడ్డి నగర్‌లో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – భక్తులకు అన్నదా

బి.ఎన్. రెడ్డి నగర్‌లో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – భక్తులకు అన్నదా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *