Friday, 13 March 2026
  • Home  
  • హత్య కేసు లో నిండుతుడికి జీవిత ఖైదు. 10000 జరిమానా.
- ఖమ్మం

హత్య కేసు లో నిండుతుడికి జీవిత ఖైదు. 10000 జరిమానా.

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) మధిర సీఐ తెలిపిన వివరాల ప్రకారం, సత్తుపల్లి 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బొరిపాధర్ గ్రామానికి చెందిన శిభ భిషోయ్ (29)కు హత్య కేసులో జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, 2025 జూన్ 8వ తేదీ రాత్రి డెందుకూరు మెగా రోడ్డు నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న శిభ భిషోయ్ వ్యక్తిగత విభేదాల కారణంగా సుమంత్ కుమార్ పాండే అనే వ్యక్తిపై ఇనుప రాడ్‌తో నిద్రలో ఉండగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై భద్రతా సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పై విధంగా తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించిన మధిర రూరల్ పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

మధిర సీఐ తెలిపిన వివరాల ప్రకారం, సత్తుపల్లి 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బొరిపాధర్ గ్రామానికి చెందిన శిభ భిషోయ్ (29)కు హత్య కేసులో జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు.

ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం, 2025 జూన్ 8వ తేదీ రాత్రి డెందుకూరు మెగా రోడ్డు నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న శిభ భిషోయ్ వ్యక్తిగత విభేదాల కారణంగా సుమంత్ కుమార్ పాండే అనే వ్యక్తిపై ఇనుప రాడ్‌తో నిద్రలో ఉండగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై భద్రతా సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పై విధంగా తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించిన మధిర రూరల్ పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.