ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతి నిధి)
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ స్వామి వివేకానందకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు శాశ్వత ఆదర్శమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, స్వామి వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆలోచనలు, సందేశాలు నేటి యువతకు మార్గదర్శకమని, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.


