బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి )
బుచ్చిరెడ్డిపాలెం మండలం లోని జొన్నవాడ గ్రామంలో వెలసివున్న
శ్రీ మల్లిఖార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానమునకు దేవాదాయశాఖ విశ్రాంత కమీషనరు ఎన్ ముక్తేశ్వర రావు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని స్వాగతించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయించి అనంతరం వారిని శేష వస్త్రముతో సత్కరించి, తీర్థ ప్రసాదములు అందజేసారు.