Monday, 30 March 2026
  • Home  
  • స్వాతంత్ర్య పోరాటంలో తారకమంత్రం “వందేమాతరం”. ఆ వందేమాతరం గీతానికి నేటికి “150 ఏళ్ళు”.క్లుప్తంగా కొన్ని వివరాలు..
- విద్య విజ్ఞానం

స్వాతంత్ర్య పోరాటంలో తారకమంత్రం “వందేమాతరం”. ఆ వందేమాతరం గీతానికి నేటికి “150 ఏళ్ళు”.క్లుప్తంగా కొన్ని వివరాలు..

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రతి నిధి, తెలంగాణ) ●స్వాతంత్ర్య మంత్రంగా మారిన “వందేమాతరం” వందేమాతరం జాతీయ గీతం యొక్క 150వ జయంతిని 2025 నవంబర్ 7 నుండి ఒక సంవత్సరం పాటు జరుపుకోవాలని నిర్ణయిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం. ఇదే సంకల్పాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ కూడా గత నెల ‘మన్ కీ బాత్’లో పునరుద్ఘాటించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో పాటు సమాజంలోని ఇతర సంస్థలు కూడా వందేమాతరం యొక్క150వ జయంతిని జరుపుకుంటున్నాయి.దేశభక్తితో కూడిన సాంస్కృతిక విలువలను సమాజానికి తీసుకువెళ్లడానికి జరుగుతున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం. ●జూన్ 23, 1757న బెంగాల్‌లోని ప్లాసీ మైదానంలో నవాబ్ సిరాజ్-ఉద్-దౌలా మరియు లార్డ్ క్లైవ్‌ల మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఆ విధంగా భారతదేశంలో స్వాతంత్ర్య సూర్యుడు అస్తమించాడు.ఈ పరాజయం అనంతరం, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు కూడా బ్రిటిష్ వారి వశమైపోయాయి. మనం వారికి బానిసలమైపోయాం. రష్యాకు చెందిన ప్రసిద్ధ తత్వవేత్త టాల్‌స్టాయ్ మన స్థితిని వర్ణిస్తూ, “ఒక వ్యాపార సంస్థ కేవలం 30 వేల మందిని తమలో కలుపుకోవడం ద్వారా, 20 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని బానిసగా మార్చివేసింది” అని పేర్కొన్నాడు. పరాధీనంగా ఉన్న దేశ దుస్థితిని చూసి, భారతమాతను ఆ బానిసత్వం నుండి విముక్తి చేయాలనే ఆకాంక్ష సమాజంలో ఉవ్వెత్తున ఎగసింది. సమాజంలోని వివిధ వర్గాలలో స్వాతంత్ర్య శంఖారావం ప్రారంభమైంది. కాళీమాత భక్తులు మరియు గురు గోరఖ్‌నాథ్ సంప్రదాయానికి చెందిన సాధువులు ఊరూరా పర్యటిస్తూ “అలఖ్ నిరంజన్” అనే నినాదంతో ప్రజలలో స్వాతంత్ర్య చైతన్యాన్ని మేల్కొలిపారు. ●సంతాల్ తెగలో జన్మించిన సిద్ధూ-కానూ అనబడే ఇద్దరు అన్నదమ్ములు 1885లో 10 వేల మంది సంతాల్‌ ప్రజలతో కలిసి “అపనీ భూమి అప్నాయేంగే అపనీ సర్కార్ బనాయేంగే”(మా భూమిని మేము తీసుకుంటాము,మా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాము) అని నినదించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857లో ఒక వ్యవస్థీకృత సాయుధ ఉద్యమం కూడా ప్రారంభమైంది. ●ఆరోజుల్లో సమాజంలో ప్రజ్వలించిన దేశభక్తి వాతావరణంలో, జూన్ 27, 1838న ఒక మహానుభావుడు జన్మించాడు,ఆయనే బంకించంద్ర చటోపాధ్యాయ. కుశాగ్రబుద్ధి కలిగిన బంకిమ్ బాబుకు దేవనాగరి, బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో గొప్ప పాండిత్యం ఉండేది. ఆయన జెస్సోర్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) లో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసారు. ఆయన ఆంగ్లేయుల అకృత్యాలు మరియు హింసలను చూసి,సాహిత్యం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలని సంకల్పించి, అనేక వ్యాసాలు,నవలలు రచించారు.దేశప్రజలపై బ్రిటిష్ వారు చేస్తున్న దారుణాలు, భారతీయులను వారు పెడుతున్న ఇబ్బందులను సమాజం దృష్టికి తీసుకురావడానికి ఆయన ఎన్నో వ్యాసాలు, నవలలు రచించారు. వీటిలో శ్రీకృష్ణ చరిత్ర, దుర్గేష్ నందిని,రాజసింహ,చంద్రశేఖర్ వంటి కావ్యాలు ప్రఖ్యాతి గాంచాయి. ఆయన తన రచనలన్నింటి ద్వారా బ్రిటిష్ పరిపాలనలోని అన్యాయాలను సమాజం కళ్ళముందుకు తీసుకురావాలని ఎంతో కృషి చేసారు. ఆ నవలల్లో, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంగా ప్రసిద్ధి చెందిన రచన “ఆనందమఠం” ఒకటి . ఈ నవలలోనే జాతీయ గీతం వందేమాతరం ఆవిర్భవించింది. భారతమాతను ప్రస్తుతిస్తూ సన్యాసులు పాడుకునే ఆనందమఠ్‌ నవలలో వర్ణించబడిన కథ, ప్రత్యేకించి ఈ గీతం కేంద్రంగా చేసుకున్న తిరుగుబాటు సంఘటనలు ముర్షిదాబాద్ మరియు నదియా జిల్లాల పరిధిలోని లాలా గోలా ప్రాంతంలో జరిగాయి. ●1875 నవంబర్ 7న భారతీయ కాలగణన ప్రకారం, కార్తీక మాసం శుక్ల పక్ష నవమి నాడు వందేమాతరం గీతం రచింపబడింది. ఆరోజు అక్షయ నవమి కావడం వల్ల జగద్ధాత్రి పూజ కూడా జరుపుకుంటారు. ●1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లో,గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.ఇది మల్హార్ రాగంలో స్వరపరచబడింది. 1896 తర్వాత, కాంగ్రెస్ సమావేశాలలో వందేమాతరం పాడడం ఒక సంప్రదాయంగా మారింది. ●బెంగాల్ నుండి ఉద్భవించిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని విభజించడానికి, అక్టోబర్ 16, 1905న ఆంగ్లేయులు వంగ-భంగ (బెంగాల్ విభజన) పథకాన్ని అమలు చేశారు. బెంగాల్ ప్రభావాన్ని తగ్గించడం, బెంగాలీ విప్లవకారుల ప్రభావాన్ని తగ్గించడం మరియు హిందూ-ముస్లింల మధ్య విభజన సృష్టించడం ఈ వంగ-భంగ పథకం యొక్క ఉద్దేశాలు.విభజనకు ముందే, దూరదృష్టి గల నాయకులు ఆగస్టు 7, 1905న కలకత్తా టౌన్ హాల్‌లో ఒక సభను ఏర్పాటు చేసారు. ఆ సభకు హాజరైన ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క “వందేమాతరం” అనే పదాలను మాత్రమే నినదించారు. ●అక్టోబర్ 16న నిర్వహించిన జాతీయ బ్లాక్ డే సందర్భంగా, ఆనంద్ మోహన్ బసు మరియు సురేంద్ర నాథ్ బెనర్జీ నాయకత్వంలో, కలకత్తాలోని సెంట్రల్ మైదాన్‌లో 50,000 మంది ప్రజలు 3.5 కిలోమీటర్ల మేర వందేమాతరం అని నినదిస్తూ, చెప్పులు లేకుండా నడిచారు. మన్మథ్ నాథ్ మిశ్రా నాయకత్వంలో “వందేమాతరం సంప్రదాయం” ఏర్పడింది. ఆంగ్లేయులు విధించిన శిక్షకు నిరసనగా, ఒక యువకుడు 500 సార్లు వందేమాతరం అని వ్రాసాడు. విప్లవకారులు కొరడా దెబ్బలు తింటూ కూడా వందేమాతరం అని పలికారు. ఇలాంటి ఎన్నో సంఘటనల కారణంగా ఆంగ్లేయులు వందేమాతరం నినాదంపైనే నిషేధం విధించారు. అప్పట్లో వందేమాతరం కేవలం దేశప్రజలకి మాత్రమే కాకుండా, విదేశాలలో ఉంటూనే స్వాతంత్ర్య సాధన సంకల్పంతో పనిచేసే విప్లవకారులకు కూడా మంత్రంగా మారింది. ఏప్రిల్ 14, 1906న అస్సాంలో బిహు ఉత్సవంలో వేలాది మంది తమ ఛాతీపై వందేమాతరం బ్యాడ్జ్ ధరించి వచ్చారు. డిసెంబర్ 22, 1908న లండన్‌లోని ఇండియా హౌస్‌లో గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా వందేమాతరం ఆలపించబడింది. ఆగస్టు 22, 1907న, స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సామ్యవాదుల సదస్సులో, మేడమ్ కామా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కెనడా-అమెరికాలో ఉన్న విప్లవకారులు కలుసుకున్నప్పుడు ఇతర సంబోధనలు కాకుండా వందేమాతరం అని మాత్రమే పలకడం ప్రారంభించారు. సోదరి నివేదిత రూపొందించిన జెండాపై వందేమాతరం ముద్రించబడింది. ‘వందేమాతరం’ వార్తాపత్రికను ప్రచురించినందుకు మహర్షి అరబిందోను ఆంగ్లేయులు శిక్షించారు. ●మహాకవి సుబ్రమణ్య భారతి తమిళ భాషలోకి, మహాత్మా గాంధీ గుజరాతీలోకి వందేమాతర గీతాన్ని అనువదించగా, తెలుగు, కన్నడ, మలయాళం మరియు ఉర్దూ వంటి ఇతర భాషలకు కూడా ఈ గీతం అనువదించబడింది.నాగ్‌పూర్‌లోని నీల్ సిటీ పాఠశాల తనిఖీకి వచ్చిన ఆంగ్ల ఇన్‌స్పెక్టర్‌కు సంఘ్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ వందేమాతరంతో స్వాగతం పలికారు. ఈ కారణాలన్నింటి వల్ల వందేమాతరం స్వాతంత్ర్య పిపాసులకు మంత్రంగా మారింది. ●స్వాతంత్ర్యంతో పాటు, వందేమాతరం కూడా స్వదేశీ మంత్రంగా మారింది. వంగ-భంగ ప్రకటన రోజున జాతీయ బ్లాక్ డే సందర్భంగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీలు కట్టి స్వదేశీ సంకల్పం చేయించారు. ఆ రోజు “విదేశీ వస్తుబహిష్కరణకు మరియు స్వదేశీ వినియోగానికి´ ప్రతిజ్ఞ చేసారు. విదేశీ వస్తువులను దహనం చేసే సమయంలో “ఓం వందేమాతరం రాష్ట్రాయ స్వాహా” అనే మంత్రాన్ని ఉచ్చరించారు. ఒక్క రోజులో స్వదేశీ ప్రచారం కోసం ప్రజల నుంచి 70,000 రూపాయలు విరాళంగా వచ్చింది. స్వదేశీ సంకల్పం తీసుకునే సమయంలో, మహిళలు పెళ్లి సమయంలో మగ్గంపై నేసిన బెంగాలీ చీర మరియు చేతికి గాజుతో చేసిన గాజులు కాకుండా, శంఖంతో చేసిన స్వదేశీ గాజులనే ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆంగ్లేయులు తయారు చేసిన వస్తువులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్వదేశీ కంపెనీలు పుట్టుకురావడం ప్రారంభించాయి, ఉదాహరణకు, తూత్తుకుడి (తమిళనాడు) లో ఉన్నటువంటి స్వదేశీ నావిగేషన్ వంటి అనేక కంపెనీలు ఆ కాలంలో జన్మించాయి.లోకమాన్య తిలక్ వందేమాతరం మరియు స్వదేశీకి మూల స్థంభంగా నిలిచారు. వీర సావర్కర్ వందేమాతరం అంటూ విదేశీ వస్తువులను కాల్చడం ద్వారా హోలీ దహనాన్ని గుర్తుచేసారు. లాలా లజపత్ రాయ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వందేమాతరం అని నినదిస్తూ వారి లాఠీ దెబ్బలను భరించారు.దానితో వందేమాతరం గీతం ఆనందమఠం నుండి వెలువడి,దేశం మొత్తానికి స్వాతంత్ర్యకాంక్షతో పాటు స్వదేశీ మంత్రంగా మారింది. ●ఆంగ్లేయుల కుట్రలు కూడా ఒక్కొక్కటే వెలుగుచూడడం మొదలైంది.దేశభక్తులకు ప్రేరణగా నిలిచిన ఈ మంత్రంలో కొందరికి విగ్రహారాధన కనిపించడం మొదలైంది. ●1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో, అప్పటి అధ్యక్షుడు మహ్మద్ అలీ,ఇస్లాంలో విగ్రహారాధన మరియు సంగీతం ఆమోదయోగ్యం కాదని చెప్తూ వందేమాతరం గానాన్ని వ్యతిరేకించారు.అయితే, బద్రుద్దీన్ తయ్యబ్, మహ్మద్ రహీమతుల్లా సయాని, నవాబ్ సయ్యద్ మహ్మద్ బహదూర్, డాక్టర్ ఎం.ఎ. అన్సారీ వంటి ముస్లిం అధ్యక్షులు ఎప్పుడూ వందేమాతరాన్ని వ్యతిరేకించలేదు. ●1915 నుండి నిరంతరం వందేమాతరాన్ని ఆలపిస్తూ వచ్చిన గొప్ప దేశభక్తుడైన విష్ణు దిగంబర్ పలుస్కర్, ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క స్వంత వేదిక కాదు, కాంగ్రెస్ వేదిక అని చెప్పి, వందేమాతరాన్ని సంపూర్ణంగా ఆలపించారు. ఈ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ నాయకత్వం కొంచెం వెనక్కి తగ్గింది; పూర్తి వందేమాతరం స్థానంలో మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించడం ప్రారంభించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వందేమాతర గీతంలో రెండు చరణాలు మాత్రమే పాడాలని, అంతేకాకుండా అవసరమైతే దానికి బదులుగా మరోక గీతాన్ని కూడా జాతీయగీతంగా పాడవచ్చు అని ఒక లేఖ ద్వారా తెలియజేశారు. ఆగస్టు 15, 1947న, శ్రీమతి సుచేతా కృపలాని వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ప్రసిద్ధ సంగీతకారుడు ఓంకారనాథ్ ఠాకూర్ ,సర్దార్ పటేల్ కోరిక మేరకు ఆల్ ఇండియా రేడియోలో పూర్తి వందేమాతరాన్ని ఆలపించారు.అప్పటి అధిష్టానం వివిధ రకాల హాస్యాస్పదమైన వాదనలు చేసి, వందేమాతరం స్థానంలో జనగణమనకు జాతీయ గీతం స్థానాన్ని ఇచ్చింది. దీని గురించి రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్, “జాతీయగీతంగా “వందేమాతరాన్ని” తిరస్కరించిన కాంగ్రెస్‌ను నేను ఊహించను కూడా లేను”. అని పేర్కొన్నారు. ●దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జనవరి 24, 1950న వందేమాతరం మరియు జనగణమన రెండింటికీ జాతీయగీతం గౌరవాన్ని ఇచ్చి ధన్యులయ్యారు .సమావేశం ముగింపులో అందరూ వందేమాతరం అని పలుకుతూ పరస్పరం అభినందించుకున్నారు. ●అక్టోబర్ 31, 2025న జరిగిన ఏక్తా పరేడ్‌లో, వివిధ వాయిద్యాల ద్వారా వందేమాతరం యొక్క సంగీత ప్రదర్శనలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కూడా మన చూసాం.సామ్రాజ్యవాదులు మన దేశంలో నాటిన విభజన బీజాల వలలో దార్శనికత

పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ప్రతి నిధి, తెలంగాణ)

●స్వాతంత్ర్య మంత్రంగా మారిన “వందేమాతరం”
వందేమాతరం జాతీయ గీతం యొక్క 150వ జయంతిని 2025 నవంబర్ 7 నుండి ఒక సంవత్సరం పాటు జరుపుకోవాలని నిర్ణయిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం. ఇదే సంకల్పాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ కూడా గత నెల ‘మన్ కీ బాత్’లో పునరుద్ఘాటించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో పాటు సమాజంలోని ఇతర సంస్థలు కూడా వందేమాతరం యొక్క150వ జయంతిని జరుపుకుంటున్నాయి.దేశభక్తితో కూడిన సాంస్కృతిక విలువలను సమాజానికి తీసుకువెళ్లడానికి జరుగుతున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయం.
●జూన్ 23, 1757న బెంగాల్‌లోని ప్లాసీ మైదానంలో నవాబ్ సిరాజ్-ఉద్-దౌలా మరియు లార్డ్ క్లైవ్‌ల మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఆ విధంగా భారతదేశంలో స్వాతంత్ర్య సూర్యుడు అస్తమించాడు.ఈ పరాజయం అనంతరం, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు కూడా బ్రిటిష్ వారి వశమైపోయాయి. మనం వారికి బానిసలమైపోయాం. రష్యాకు చెందిన ప్రసిద్ధ తత్వవేత్త టాల్‌స్టాయ్ మన స్థితిని వర్ణిస్తూ, “ఒక వ్యాపార సంస్థ కేవలం 30 వేల మందిని తమలో కలుపుకోవడం ద్వారా, 20 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని బానిసగా మార్చివేసింది” అని పేర్కొన్నాడు.
పరాధీనంగా ఉన్న దేశ దుస్థితిని చూసి, భారతమాతను ఆ బానిసత్వం నుండి విముక్తి చేయాలనే ఆకాంక్ష సమాజంలో ఉవ్వెత్తున ఎగసింది. సమాజంలోని వివిధ వర్గాలలో స్వాతంత్ర్య శంఖారావం ప్రారంభమైంది. కాళీమాత భక్తులు మరియు గురు గోరఖ్‌నాథ్ సంప్రదాయానికి చెందిన సాధువులు ఊరూరా పర్యటిస్తూ “అలఖ్ నిరంజన్” అనే నినాదంతో ప్రజలలో స్వాతంత్ర్య చైతన్యాన్ని మేల్కొలిపారు.
●సంతాల్ తెగలో జన్మించిన సిద్ధూ-కానూ అనబడే ఇద్దరు అన్నదమ్ములు 1885లో 10 వేల మంది సంతాల్‌ ప్రజలతో కలిసి “అపనీ భూమి అప్నాయేంగే అపనీ సర్కార్ బనాయేంగే”(మా భూమిని మేము తీసుకుంటాము,మా ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాము) అని నినదించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857లో ఒక వ్యవస్థీకృత సాయుధ ఉద్యమం కూడా ప్రారంభమైంది.
●ఆరోజుల్లో సమాజంలో ప్రజ్వలించిన దేశభక్తి వాతావరణంలో, జూన్ 27, 1838న ఒక మహానుభావుడు జన్మించాడు,ఆయనే బంకించంద్ర చటోపాధ్యాయ. కుశాగ్రబుద్ధి కలిగిన బంకిమ్ బాబుకు దేవనాగరి, బెంగాలీ మరియు ఆంగ్ల భాషలలో గొప్ప పాండిత్యం ఉండేది. ఆయన జెస్సోర్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) లో డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసారు.
ఆయన ఆంగ్లేయుల అకృత్యాలు మరియు హింసలను చూసి,సాహిత్యం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలని సంకల్పించి, అనేక వ్యాసాలు,నవలలు రచించారు.దేశప్రజలపై బ్రిటిష్ వారు చేస్తున్న దారుణాలు, భారతీయులను వారు పెడుతున్న ఇబ్బందులను సమాజం దృష్టికి తీసుకురావడానికి ఆయన ఎన్నో వ్యాసాలు, నవలలు రచించారు. వీటిలో శ్రీకృష్ణ చరిత్ర, దుర్గేష్ నందిని,రాజసింహ,చంద్రశేఖర్ వంటి కావ్యాలు ప్రఖ్యాతి గాంచాయి. ఆయన తన రచనలన్నింటి ద్వారా బ్రిటిష్ పరిపాలనలోని అన్యాయాలను సమాజం కళ్ళముందుకు తీసుకురావాలని ఎంతో కృషి చేసారు. ఆ నవలల్లో, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంగా ప్రసిద్ధి చెందిన రచన “ఆనందమఠం” ఒకటి . ఈ నవలలోనే జాతీయ గీతం వందేమాతరం ఆవిర్భవించింది. భారతమాతను ప్రస్తుతిస్తూ సన్యాసులు పాడుకునే ఆనందమఠ్‌ నవలలో వర్ణించబడిన కథ, ప్రత్యేకించి ఈ గీతం కేంద్రంగా చేసుకున్న తిరుగుబాటు సంఘటనలు ముర్షిదాబాద్ మరియు నదియా జిల్లాల పరిధిలోని లాలా గోలా ప్రాంతంలో జరిగాయి.
●1875 నవంబర్ 7న భారతీయ కాలగణన ప్రకారం, కార్తీక మాసం శుక్ల పక్ష నవమి నాడు వందేమాతరం గీతం రచింపబడింది. ఆరోజు అక్షయ నవమి కావడం వల్ల జగద్ధాత్రి పూజ కూడా జరుపుకుంటారు.
●1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లో,గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.ఇది మల్హార్ రాగంలో స్వరపరచబడింది. 1896 తర్వాత, కాంగ్రెస్ సమావేశాలలో వందేమాతరం పాడడం ఒక సంప్రదాయంగా మారింది.
●బెంగాల్ నుండి ఉద్భవించిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని విభజించడానికి, అక్టోబర్ 16, 1905న ఆంగ్లేయులు వంగ-భంగ (బెంగాల్ విభజన) పథకాన్ని అమలు చేశారు. బెంగాల్ ప్రభావాన్ని తగ్గించడం, బెంగాలీ విప్లవకారుల ప్రభావాన్ని తగ్గించడం మరియు హిందూ-ముస్లింల మధ్య విభజన సృష్టించడం ఈ వంగ-భంగ పథకం యొక్క ఉద్దేశాలు.విభజనకు ముందే, దూరదృష్టి గల నాయకులు ఆగస్టు 7, 1905న కలకత్తా టౌన్ హాల్‌లో ఒక సభను ఏర్పాటు చేసారు. ఆ సభకు హాజరైన ప్రతి ఒక్క వ్యక్తి ఒక్క “వందేమాతరం” అనే పదాలను మాత్రమే నినదించారు.
●అక్టోబర్ 16న నిర్వహించిన జాతీయ బ్లాక్ డే సందర్భంగా, ఆనంద్ మోహన్ బసు మరియు సురేంద్ర నాథ్ బెనర్జీ నాయకత్వంలో, కలకత్తాలోని సెంట్రల్ మైదాన్‌లో 50,000 మంది ప్రజలు 3.5 కిలోమీటర్ల మేర వందేమాతరం అని నినదిస్తూ, చెప్పులు లేకుండా నడిచారు. మన్మథ్ నాథ్ మిశ్రా నాయకత్వంలో “వందేమాతరం సంప్రదాయం” ఏర్పడింది. ఆంగ్లేయులు విధించిన శిక్షకు నిరసనగా, ఒక యువకుడు 500 సార్లు వందేమాతరం అని వ్రాసాడు. విప్లవకారులు కొరడా దెబ్బలు తింటూ కూడా వందేమాతరం అని పలికారు. ఇలాంటి ఎన్నో సంఘటనల కారణంగా ఆంగ్లేయులు వందేమాతరం నినాదంపైనే నిషేధం విధించారు.
అప్పట్లో వందేమాతరం కేవలం దేశప్రజలకి మాత్రమే కాకుండా, విదేశాలలో ఉంటూనే స్వాతంత్ర్య సాధన సంకల్పంతో పనిచేసే విప్లవకారులకు కూడా మంత్రంగా మారింది. ఏప్రిల్ 14, 1906న అస్సాంలో బిహు ఉత్సవంలో వేలాది మంది తమ ఛాతీపై వందేమాతరం బ్యాడ్జ్ ధరించి వచ్చారు. డిసెంబర్ 22, 1908న లండన్‌లోని ఇండియా హౌస్‌లో గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా వందేమాతరం ఆలపించబడింది. ఆగస్టు 22, 1907న, స్టట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సామ్యవాదుల సదస్సులో, మేడమ్ కామా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కెనడా-అమెరికాలో ఉన్న విప్లవకారులు కలుసుకున్నప్పుడు ఇతర సంబోధనలు కాకుండా వందేమాతరం అని మాత్రమే పలకడం ప్రారంభించారు. సోదరి నివేదిత రూపొందించిన జెండాపై వందేమాతరం ముద్రించబడింది. ‘వందేమాతరం’ వార్తాపత్రికను ప్రచురించినందుకు మహర్షి అరబిందోను ఆంగ్లేయులు శిక్షించారు.
●మహాకవి సుబ్రమణ్య భారతి తమిళ భాషలోకి, మహాత్మా గాంధీ గుజరాతీలోకి వందేమాతర గీతాన్ని అనువదించగా, తెలుగు, కన్నడ, మలయాళం మరియు ఉర్దూ వంటి ఇతర భాషలకు కూడా ఈ గీతం అనువదించబడింది.నాగ్‌పూర్‌లోని నీల్ సిటీ పాఠశాల తనిఖీకి వచ్చిన ఆంగ్ల ఇన్‌స్పెక్టర్‌కు సంఘ్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్ వందేమాతరంతో స్వాగతం పలికారు. ఈ కారణాలన్నింటి వల్ల వందేమాతరం స్వాతంత్ర్య పిపాసులకు మంత్రంగా మారింది.
●స్వాతంత్ర్యంతో పాటు, వందేమాతరం కూడా స్వదేశీ మంత్రంగా మారింది. వంగ-భంగ ప్రకటన రోజున జాతీయ బ్లాక్ డే సందర్భంగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రాఖీలు కట్టి స్వదేశీ సంకల్పం చేయించారు. ఆ రోజు “విదేశీ వస్తుబహిష్కరణకు మరియు స్వదేశీ వినియోగానికి´ ప్రతిజ్ఞ చేసారు. విదేశీ వస్తువులను దహనం చేసే సమయంలో “ఓం వందేమాతరం రాష్ట్రాయ స్వాహా” అనే మంత్రాన్ని ఉచ్చరించారు. ఒక్క రోజులో స్వదేశీ ప్రచారం కోసం ప్రజల నుంచి 70,000 రూపాయలు విరాళంగా వచ్చింది. స్వదేశీ సంకల్పం తీసుకునే సమయంలో, మహిళలు పెళ్లి సమయంలో మగ్గంపై నేసిన బెంగాలీ చీర మరియు చేతికి గాజుతో చేసిన గాజులు కాకుండా, శంఖంతో చేసిన స్వదేశీ గాజులనే ధరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆంగ్లేయులు తయారు చేసిన వస్తువులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్వదేశీ కంపెనీలు పుట్టుకురావడం ప్రారంభించాయి, ఉదాహరణకు, తూత్తుకుడి (తమిళనాడు) లో ఉన్నటువంటి స్వదేశీ నావిగేషన్ వంటి అనేక కంపెనీలు ఆ కాలంలో జన్మించాయి.లోకమాన్య తిలక్ వందేమాతరం మరియు స్వదేశీకి మూల స్థంభంగా నిలిచారు. వీర సావర్కర్ వందేమాతరం అంటూ విదేశీ వస్తువులను కాల్చడం ద్వారా హోలీ దహనాన్ని గుర్తుచేసారు. లాలా లజపత్ రాయ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వందేమాతరం అని నినదిస్తూ వారి లాఠీ దెబ్బలను భరించారు.దానితో వందేమాతరం గీతం ఆనందమఠం నుండి వెలువడి,దేశం మొత్తానికి స్వాతంత్ర్యకాంక్షతో పాటు స్వదేశీ మంత్రంగా మారింది.
●ఆంగ్లేయుల కుట్రలు కూడా ఒక్కొక్కటే వెలుగుచూడడం మొదలైంది.దేశభక్తులకు ప్రేరణగా నిలిచిన ఈ మంత్రంలో కొందరికి విగ్రహారాధన కనిపించడం మొదలైంది.
●1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో, అప్పటి అధ్యక్షుడు మహ్మద్ అలీ,ఇస్లాంలో విగ్రహారాధన మరియు సంగీతం ఆమోదయోగ్యం కాదని చెప్తూ వందేమాతరం గానాన్ని వ్యతిరేకించారు.అయితే, బద్రుద్దీన్ తయ్యబ్, మహ్మద్ రహీమతుల్లా సయాని, నవాబ్ సయ్యద్ మహ్మద్ బహదూర్, డాక్టర్ ఎం.ఎ. అన్సారీ వంటి ముస్లిం అధ్యక్షులు ఎప్పుడూ వందేమాతరాన్ని వ్యతిరేకించలేదు.
●1915 నుండి నిరంతరం వందేమాతరాన్ని ఆలపిస్తూ వచ్చిన గొప్ప దేశభక్తుడైన విష్ణు దిగంబర్ పలుస్కర్, ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క స్వంత వేదిక కాదు, కాంగ్రెస్ వేదిక అని చెప్పి, వందేమాతరాన్ని సంపూర్ణంగా ఆలపించారు. ఈ వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ నాయకత్వం కొంచెం వెనక్కి తగ్గింది; పూర్తి వందేమాతరం స్థానంలో మొదటి రెండు చరణాలు మాత్రమే ఆలపించడం ప్రారంభించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వందేమాతర గీతంలో రెండు చరణాలు మాత్రమే పాడాలని, అంతేకాకుండా అవసరమైతే దానికి బదులుగా మరోక గీతాన్ని కూడా జాతీయగీతంగా పాడవచ్చు అని ఒక లేఖ ద్వారా తెలియజేశారు. ఆగస్టు 15, 1947న, శ్రీమతి సుచేతా కృపలాని వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ప్రసిద్ధ సంగీతకారుడు ఓంకారనాథ్ ఠాకూర్ ,సర్దార్ పటేల్ కోరిక మేరకు ఆల్ ఇండియా రేడియోలో పూర్తి వందేమాతరాన్ని ఆలపించారు.అప్పటి అధిష్టానం వివిధ రకాల హాస్యాస్పదమైన వాదనలు చేసి, వందేమాతరం స్థానంలో జనగణమనకు జాతీయ గీతం స్థానాన్ని ఇచ్చింది. దీని గురించి రాజర్షి పురుషోత్తం దాస్ టాండన్, “జాతీయగీతంగా “వందేమాతరాన్ని” తిరస్కరించిన కాంగ్రెస్‌ను నేను ఊహించను కూడా లేను”. అని పేర్కొన్నారు.
●దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జనవరి 24, 1950న వందేమాతరం మరియు జనగణమన రెండింటికీ జాతీయగీతం గౌరవాన్ని ఇచ్చి ధన్యులయ్యారు
.సమావేశం ముగింపులో అందరూ వందేమాతరం అని పలుకుతూ పరస్పరం అభినందించుకున్నారు.
●అక్టోబర్ 31, 2025న జరిగిన ఏక్తా పరేడ్‌లో, వివిధ వాయిద్యాల ద్వారా వందేమాతరం యొక్క సంగీత ప్రదర్శనలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కూడా మన చూసాం.సామ్రాజ్యవాదులు మన దేశంలో నాటిన విభజన బీజాల వలలో దార్శనికత లేని మన అప్పటి నాయకత్వం చిక్కుకున్నది.అవి నేడు వేర్పాటువాద వృక్షాలుగా మన ముందు నిలబడి ఉన్నాయి.
●1947లో జరిగిన భారతదేశ విభజన భయనక వాతావరణాన్ని కూడా మనం చూశాం. అలా జరగకుండా ఉండాలంటే, మనం సాంస్కృతిక ఐక్యత ఆధారంగా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అటువంటి సాంస్కృతిక ఐక్యతకు ప్రతిరూపం వందేమాతర గీతం.వందేమాతరం యొక్క 150వ జయంతి ఈ సంకల్పాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుంది.
నవంబర్ 7వ తేదీ యావద్భారతదేశం మొత్తం ఆనందం, ఉత్సాహం మరియు శ్రద్ధాభక్తులతో జాతీయ గీతం అయిన పూర్తి వందేమాతరాన్ని పాడుదాం.పూర్తి గీతాన్ని ప్రతి ఒక్కరం నేర్చుకుందాం..
“వందేమాతరం – భారత్ మాతా కీ జయ్”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.