మైలవరం, , సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
మైలవరం పట్టణంలో బుధవారం స్వస్థ్ నారీ–సశక్తి అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో శిబిరం జరిగింది. మహిళల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా, గైనకాలజీ, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి, గుండె, మధుమేహం, నోటి క్యాన్సర్, మానసిక వైద్య పరీక్షలు అందజేశారు. కూటమి నాయకులు, అంగన్వాడీ, పీహెచ్‌సీ సిబ్బంది, టాటా ట్రస్ట్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


