Tuesday, 24 March 2026
  • Home  
  • స్వర్ణాంధ్ర @ 2047లో లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఈ–వాహనాలు పంపిణీ
- ఎన్ టి ఆర్ జిల్లా

స్వర్ణాంధ్ర @ 2047లో లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఈ–వాహనాలు పంపిణీ

జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు (డీపీ) తండాలోని రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర @ 2047 – P4 కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పాన్సర్‌గా వ్యవహరించగా, ఫ్యాక్టరీ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభించిన స్వర్ణాంధ్ర @ 2047 కార్యక్రమం రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే మహత్తర ప్రణాళికగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని తెలిపారు. రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైన నాటి నుంచి సిఎస్ఆర్ నిధులతో చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, మౌలిక వసతుల కల్పనలో ముందుండటం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ముఖ్యంగా కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ ఆటోలు అందించడం ద్వారా లబ్ధిదారుల జీవనోపాధికి తోడ్పాటు లభిస్తోందని పేర్కొంటూ ఫ్యాక్టరీ యాజమా న్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాలకృష్ణ, రామ్‌కో సిమెంట్స్ యాజమాన్య ప్రతినిధులు ఎస్‌వీఆర్‌కే మూర్తి రావు, ఫరూక్ తదితరులుపాల్గొన్నారు.

జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు (డీపీ) తండాలోని రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర @ 2047 – P4 కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పాన్సర్‌గా వ్యవహరించగా, ఫ్యాక్టరీ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభించిన స్వర్ణాంధ్ర @ 2047 కార్యక్రమం రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే మహత్తర ప్రణాళికగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని తెలిపారు.
రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైన నాటి నుంచి సిఎస్ఆర్ నిధులతో చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, మౌలిక వసతుల కల్పనలో ముందుండటం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ముఖ్యంగా కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ ఆటోలు అందించడం ద్వారా లబ్ధిదారుల జీవనోపాధికి తోడ్పాటు లభిస్తోందని పేర్కొంటూ ఫ్యాక్టరీ యాజమా న్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాలకృష్ణ, రామ్‌కో సిమెంట్స్ యాజమాన్య ప్రతినిధులు ఎస్‌వీఆర్‌కే మూర్తి రావు, ఫరూక్ తదితరులుపాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.