ఖమ్మం పట్టణంలో స్వర్ణకార కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక స్వర్ణకార కుటుంబంలో గోపాలపురం ప్రకాష్ గారి భార్య గోవిందమ్మ 48 సంవత్సరాలు,పెద్ద కుమార్తె రాధిక 31, రమ్య 30 సంవత్సరాలు ఈ ముగ్గురు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆడపిల్లల పెళ్లిళ్లు జరుగుతాయో, లేదో అని ఆలోచిస్తూ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం గడవడం కష్టంగా మారడం, చాలీచాలని జీవితాన్ని నడపలేక మనోవేదనకు గురై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది చాలా ఘోరమైన బాధాకరమైన విషయం. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సమాజం తరుపున ప్రగాఢ సంతాపాన్ని చేస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి ఆధునీకరణ చెందకపోవడం. గ్లోబలైజేషన్ పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల పెట్టుబడిదారుల వల, కార్పొరేట్ I జువెలరీ షాపు వల్ల స్థానిక స్వర్ణ కారులకు కుటుంబం గడిచే ఎటువంటి పరిస్థితి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి ఒకపక్క ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు మరొక పక్క కరోనా మహమ్మారి ప్రభావం వలన విశ్వకర్మ వృత్తిదారుల కుటుంబాలలో తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు ఈరోజుల్లో స్వర్ణకార కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కష్టంగా ఉండి అదేవిధంగా అనారోగ్యం తో పాటు పిల్లల చదువులు ఎదిగివచ్చిన ఆడపిల్లల పెళ్లిళ్లు జరుగుతాయో జరగవు అని ఒక భయం ఏర్పడింది కాబట్టి ఇటువంటి సంక్షోభ కాలంలో ప్రభుత్వాలు స్పందించి స్వర్ణకార కుటుంబాలకు అదేవిధంగా విశ్వకర్మ వృత్తులు అయినటువంటి కమ్మరి కంచరి శిల్పి వడ్రంగం వృత్తుల వారిని ఆదుకోవాలని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్లో కేటాయింపులు తగు విధంగా జరిపి వృత్తుల పరిరక్షణ కి తగు చర్యలు తీసుకోవాలని విశ్వబ్రాహ్మణ సమాజం డిమాండ్ చేస్తుంది .