Wednesday, 11 February 2026
  • Home  
  • స్వయంగా ఆసుపత్రికి చేర్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
- ఖమ్మం

స్వయంగా ఆసుపత్రికి చేర్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

బస్సు ఢీకొని భార్య మృతి – రక్తస్రావంలో విలవిల్లాడిన భర్త గాయపడిన బాధితుడిని స్వయంగా ఆసుపత్రికి చేర్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఖమ్మం, ఆగస్టు 31: ఒక క్షణం ఆలస్యం, ఒక వాహన నిర్లక్ష్యం – ఒక చిన్న కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచింది. ఆదివారం సాయంత్రం రంగనాధపాలెం మండలం వెంకటాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం భయంకర దృశ్యాలకు వేదిక అయింది. ఏన్కూర్ మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య లక్ష్మితో కలిసి టూవీలర్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. అయితే వెనకనుంచి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కుటుంబం జీవితాలు క్షణాల్లో మారిపోయాయి. బస్సు టైరుకింద కొట్టుకుపోయిన లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రక్తపు మడుగు లో విలవిల్లాడుతూ పడిన వెంకటేశ్వర్లు, కళ్లముందే శ్వాస ఆపేసిన తన భార్యను చూసి వేదనతో కేకలు వేస్తూ కన్నీటి భరితంలో మునిగిపోయారు. ఆ దృశ్యం చూసిన ప్రత్యక్ష సాక్షులు సైతం క్షణం మాటరాలేక స్థబ్ధులయ్యారు. ఇదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఘటనను గమనించారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వాహనం ఆపి గాయపడిన వెంకటేశ్వర్లను సాంత్వనపరచారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, 108 అంబులెన్స్‌కు కాల్ చేసి, గాయపడిన బాధితుడిని తనే స్వయంగా ఆసుపత్రికి చేర్చారు. రక్తంతో తడిసిన ఆయనకు ప్రథమ చికిత్స అందేలా క్షణక్షణం పర్యవేక్షిస్తూ, ధైర్యం చెప్పడం మానవీయతకు నిదర్శనమైంది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. “ఒకరి నిర్లక్ష్యం వల్ల అమాయక కుటుంబాలు ఎన్ని ప్రాణాలు కోల్పోవాలి?” అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్సు ఢీకొని భార్య మృతి – రక్తస్రావంలో విలవిల్లాడిన భర్త

గాయపడిన బాధితుడిని స్వయంగా ఆసుపత్రికి చేర్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు

ఖమ్మం, ఆగస్టు 31:
ఒక క్షణం ఆలస్యం, ఒక వాహన నిర్లక్ష్యం – ఒక చిన్న కుటుంబాన్నే శోకసంద్రంలో ముంచింది. ఆదివారం సాయంత్రం రంగనాధపాలెం మండలం వెంకటాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం భయంకర దృశ్యాలకు వేదిక అయింది. ఏన్కూర్ మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య లక్ష్మితో కలిసి టూవీలర్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. అయితే వెనకనుంచి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కుటుంబం జీవితాలు క్షణాల్లో మారిపోయాయి.

బస్సు టైరుకింద కొట్టుకుపోయిన లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రక్తపు మడుగు లో విలవిల్లాడుతూ పడిన వెంకటేశ్వర్లు, కళ్లముందే శ్వాస ఆపేసిన తన భార్యను చూసి వేదనతో కేకలు వేస్తూ కన్నీటి భరితంలో మునిగిపోయారు. ఆ దృశ్యం చూసిన ప్రత్యక్ష సాక్షులు సైతం క్షణం మాటరాలేక స్థబ్ధులయ్యారు.

ఇదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఘటనను గమనించారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వాహనం ఆపి గాయపడిన వెంకటేశ్వర్లను సాంత్వనపరచారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి, 108 అంబులెన్స్‌కు కాల్ చేసి, గాయపడిన బాధితుడిని తనే స్వయంగా ఆసుపత్రికి చేర్చారు. రక్తంతో తడిసిన ఆయనకు ప్రథమ చికిత్స అందేలా క్షణక్షణం పర్యవేక్షిస్తూ, ధైర్యం చెప్పడం మానవీయతకు నిదర్శనమైంది.

ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. “ఒకరి నిర్లక్ష్యం వల్ల అమాయక కుటుంబాలు ఎన్ని ప్రాణాలు కోల్పోవాలి?” అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.