పత్రిక ప్రకటన
రాజమహేంద్రవరం, తేది:20.9.2025
“స్వచ్చ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా” కార్యక్రమంలో సెప్టెంబర్ నెలలో గ్రీన్ ఆంధ్రా ను పురస్కరించుకుని మొక్కల నాటే కార్యక్రమం
శనివారంరాజమహేంద్రవరం, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని స్థానిక వ్యవసాయ కళాశాలలో, కళాశాల అసోసియేట్ డీన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారము “సాసా” కార్యక్రమం నిర్వహించారు.
ఈ నెల (సెప్టెంబర్ 2025) అంశం “గ్రీన్ ఆంధ్రా” ను పురస్కరించుకుని, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది కళాశాల ఆవరణలోని పచ్చని మొక్కలను నాటడం జరిగిందిన్నారు. ఈ కార్యక్రమంలో గంగ రావి నుంచి వివిధ జాతుల మొక్కలను, ఉద్యానవన మరియు సేద్య విభాగాల మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు నాటడం జరిగిందన్నారు.
ఈ సందర్భంలో జాతీయ సేవా పథకం అధికారి డా. వసంత భాను చెబుతూ, చెట్లను సంరక్షించడం వలన పర్యావరణం ఆరోగ్యంగా ఉంచబడుతుంది అని, మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా నగర ప్రాంతాల్లో పచ్చదనం పెరిగి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు.
కార్యక్రమంలో ఉద్యాన శాస్త్ర విభాగాధిపతి డా. సునీత యమ్., ప్రొఫెషన్ భవానీ ప్రసాద్, డా. రమేష్ తదితర భోధక, భోధనేతర సిబ్బంది, విద్యార్థులు সক్రమంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


