Wednesday, 25 March 2026
  • Home  
  • స్వచ్ఛతాహి సేవ ఉత్సవ్ లో అందరూ భాగం కావాలి
- ఆంధ్రప్రదేశ్ - శ్రీకాకుళం 

స్వచ్ఛతాహి సేవ ఉత్సవ్ లో అందరూ భాగం కావాలి

ప్లాస్టిక్ రహిత జిల్లాగా శ్రీకాకుళం ముందుండాలని, జాయింట్ కలక్టర్ ఫర్మన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మన ఊరు, మన బాధ్యత అనే నినాదంతో స్వచ్ఛతాహి సేవా ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, మున్సిపల్ కార్యాలయం నుండి సూర్యమహాల్ కూడలి వరకు ర్యాలీతో కదలి వెళ్లారు. ఇందులో భాగముగా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవా ఉత్సవ్ లో అందరూ భాగం కావాలని, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీ నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత ఉత్సవ్ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భాగముగా ఇటీవలే జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా బాధ్యతలందుకున్న లయన్ పొన్నాడ. రవి కుమార్ ను అభినందించి శుభాకాంక్షలని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి.సింధూర ఆధ్వర్యంలో జూట్ సంచులను, గుడ్డ సంచులు ను పారిశుధ్య కార్మికులకు అందించి పర్యావరణ పరిరక్షణలో అందరం బాగమవ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక శాసనసభ్యులు గొండు.శంకర్ మాట్లాడుతూ కాలుష్యంతో నిండిపోయిన వాతావరణంతో రోగాల బారిన పడుతున్నామన్నామని, ప్రతీ ఒక్కరూ బాధ్యతతో ఆలోచించి ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పి, గుడ్డ సంచులను వాడాలని, అవి తొందరగా భూగర్భంలో కలిసిపోతాయని, వీలైనంతవరకు మొక్కలని, వాటి పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ. రవి కుమార్ కు, పలు సూచనలు, సలహాలు అందించి, జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణంలో మార్పు రావాలంటే, ముందుగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని,అక్టోబర్ 2వ తేదీ నుండి ప్లాస్టిక్ పూర్తిగా వాడకాన్ని నిషేధం చేస్తూ నిర్ణయం తీసున్నామని చెప్పారు.లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ గతంలో కూడా జూట్ సంచులను ప్రజలకు అందించి అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా నగరంలో గల స్వచ్ఛంద సంస్థలు ఒక తాటి పై నడుస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్ కు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుదీర్ కుమార్, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు, యువత పాల్గొన్నారు.

  • లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో నార సంచులు, గుడ్డ సంచులు పంపిణికి శ్రీకారం
    (శ్రీకాకుళం – )
  • జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహమ్మద్ ఖాన్

ప్లాస్టిక్ రహిత జిల్లాగా శ్రీకాకుళం ముందుండాలని, జాయింట్ కలక్టర్ ఫర్మన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మన ఊరు, మన బాధ్యత అనే నినాదంతో స్వచ్ఛతాహి సేవా ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, మున్సిపల్ కార్యాలయం నుండి సూర్యమహాల్ కూడలి వరకు ర్యాలీతో కదలి వెళ్లారు. ఇందులో భాగముగా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవా ఉత్సవ్ లో అందరూ భాగం కావాలని, ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సెప్టెంబర్ 17వ తేదీ నుండి గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత ఉత్సవ్ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో భాగముగా ఇటీవలే జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ గా బాధ్యతలందుకున్న లయన్ పొన్నాడ. రవి కుమార్ ను అభినందించి శుభాకాంక్షలని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి.సింధూర ఆధ్వర్యంలో జూట్ సంచులను, గుడ్డ సంచులు ను పారిశుధ్య కార్మికులకు అందించి పర్యావరణ పరిరక్షణలో అందరం బాగమవ్వాలని పిలుపునిచ్చారు.

స్థానిక శాసనసభ్యులు గొండు.శంకర్ మాట్లాడుతూ కాలుష్యంతో నిండిపోయిన వాతావరణంతో రోగాల బారిన పడుతున్నామన్నామని, ప్రతీ ఒక్కరూ బాధ్యతతో ఆలోచించి ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పి, గుడ్డ సంచులను వాడాలని, అవి తొందరగా భూగర్భంలో కలిసిపోతాయని, వీలైనంతవరకు మొక్కలని, వాటి పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ. రవి కుమార్ కు, పలు సూచనలు, సలహాలు అందించి, జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణంలో మార్పు రావాలంటే, ముందుగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని,అక్టోబర్ 2వ తేదీ నుండి ప్లాస్టిక్ పూర్తిగా వాడకాన్ని నిషేధం చేస్తూ నిర్ణయం తీసున్నామని చెప్పారు.లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ గతంలో కూడా జూట్ సంచులను ప్రజలకు అందించి అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించారని గుర్తుచేశారు.

ముఖ్యంగా నగరంలో గల స్వచ్ఛంద సంస్థలు ఒక తాటి పై నడుస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అందుకు జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్ కు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుదీర్ కుమార్, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు, యువత పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.