పున్నమి ప్రతినిధి
దోమల నివారణ కోసం వాడుతున్న స్లీప్‌వెల్ అగరబత్తీల్లో మెటాఫ్లూత్రిన్ (Metafluthrin) అనే ప్రమాదకర పురుగుమందు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. విజయవాడలోని ఓ దుకాణంలో సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్‌కు పంపగా, ప్రాణాంతక రసాయనం ఉన్నట్టు తేలింది. దీని వల్ల శ్వాసకోశ, నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


