గాజువాక సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి)
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్* ( గాజువాక ) విశాఖ జిల్లా వారి ఆధ్వర్యంలో దసరా వేడుకలు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్, విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధానకార్యదర్శి అయిన మొల్లి పెంటిరాజు మాట్లాడుతూ జర్నలిస్టు సోదరీ సోదరీమణులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, రాజకీయరంగంలో జర్నలిస్టులు ఎంతో సహకారం అందించారని,జర్నలిజం వృత్తి ఒక బాధ్యత, సమాజంలో చాలా గౌరవం కల్పించేలా, ప్రజా సమస్యలపై సమాజాన్ని చైతన్య పరచాలి అని, యువత జర్నలిజని కూడా ఒక వృత్తిలో భాగంగా ఎంచుకోవాలని తెలిపారు. గాజువాక జర్నలిస్టుల సమస్యలపై గాజువాక MLA, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లి వారికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శిరీష, గౌతమ్,వసంత్,tv5 శ్రీను ,శ్రీను, జాన్ వరబాబు,గోవింద్,శివ,జోగారావు, క్రిష్ణ, సునీల్ సత్యనారాయణ,ఎల్లాజీ, తదితరులు పాల్గొన్నారు.


