ఒకప్పుడు పిల్లలు ఆటలలో మునిగి తేలేవారు, ఇప్పుడు మాత్రం స్క్రీన్లలో మునిగిపోతున్నారు.
తల్లిదండ్రులు ప్రేమతో ఇస్తున్న స్మార్ట్ఫోన్లు ఇప్పుడు పిల్లల అటెన్షన్ స్పాన్, క్రియేటివిటీ, ఎమోషనల్ గ్రోత్‌ను దోచుకుంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల పిల్లలు బయట ఆడుకునే అలవాటు తగ్గిపోతోంది.
దాని ప్రభావంగా మానసిక ఏకాగ్రత, సామాజిక నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ వంటి అంశాలు దెబ్బతింటున్నాయి.
తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి, పిల్లల స్క్రీన్ టైమ్‌పై పరిమితులు విధించి, వారిని సృజనాత్మక కార్యకలాపాలు, క్రీడల వైపు మళ్లించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.


