గాజువాక, నవంబర్ (పున్నమి ప్రతినిధి):
గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలోని సిద్ధార్థ నగర్ సమీపంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాధం (జగన్) పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —
స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. మొత్తం నాలుగు ఎకరాలు యాభై సెంట్ల స్థలంలో క్రీడాకారుల అభ్యాసానికి అనువైన ఆధునిక సదుపాయాలు కల్పించనున్నాం. అధికారులు, కాంట్రాక్టర్‌లు పనులను వేగంగా పూర్తి చేయాలి. నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదు” అని తెలిపారు.
ప్రారంభానికి సంబంధించి అధికారులు, కాంట్రాక్టర్ గ్రౌండ్‌లో మార్కింగ్ పనులు పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు విజయరామరాజు, బెల్లంకొండ రాజన్ రాజు, కాండ్రేగుల శ్రీనివాసనాయుడు, పావాడ రమణమూర్తి, డీవీ సూరిబాబు, బొడ్డా సన్యాసిరావు, గండేపల్లి రాము, జాన్ రమేష్, సుందర్ సునీల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


