సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్ పోస్టును తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి ఈ మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. రిజిస్టర్ పోస్టు ఇకపై స్పీడ్ పోస్టు కింద వాల్యూయాడెడ్ సర్వీసుగా అందుబాటులో ఉంటుంది. అలాగే, దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ అమలులోకి తీసుకువచ్చారు. డెలివరీ సురక్షితంగా జరిగేందుకు OTP ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నిర్ణయంతో సేవల వేగం, విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది. తపాలా వ్యవస్థను ఆధునీకరించేందుకు తీసుకున్న ఈ చర్య ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా అధికారులు పేర్కొన్నారు.


