గన్నవరం నియోజకవర్గం(పున్నమి ప్రతినిధి)
వికలాంగత్వానికి కారణాలు అనేకమని ముఖ్యంగా మేనరికం,క్రోమో జోముల లోపం, బాల వివాహాలు వంటి కారణాలెన్నో ఉన్నాయని పెద్ద ఆవుటపల్లి పీహెచ్ డాక్టర్ సుజిత అన్నారు. గన్నవరం మండలం దావాజిగూడెం హెల్పింగ్ హ్యండ్స్ _సొసైటీ_ ఆధ్వర్యంలో గురువారం నాడు స్పందన మానసిక వికాస కేంద్రం నందువికలాంగత్వానికి కారణాలు నివారణోపాయాలు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ సుజిత మాట్లాడుతూ మేనరికం పెళ్లిళ్లతో పుట్టే పిల్లలకు వైకల్యం రావడానికి వీలుందన్నారు.జన్యుపరమైన లోపాలు,గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల వికలత్వం సంభవిస్తుందని గర్భిణీలు మంచి ఆహారం తీసుకుంటే సమస్య ఉండదని ముఖ్యంగా మేనరికం పెళ్లిళ్లు మానుకోవాలన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత పల్స్పోలియో చుక్కలు వేయడం వల్ల వికలాంగత్వం రావడానికి వీలుండదని, ప్రజల్లో ఇంకా అవగాహన రావలసిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ వివరించారు.గన్నవరం ప్రాంతంలో దివ్యాంగుల కొరకు స్పందన మానసిక వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి దివ్యాంగులను చేరదీసి ఉచితంగా విద్య వైద్య రవాణా భోజన వంటి సౌకర్యాలను అందిస్తున్న సంస్థ చైర్మన్ సంకాబత్తుల వెంకట్, సెక్రటరీ సంకాబత్తుల రజిత వెంకట్ ను డాక్టర్ సుజిత అభినందించారు.
హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ సెక్రటరీ సంకాబత్తుల రజిత వెంకట్ మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ ఎంతోమంది దివ్యాంగులకు వెలుగులు నింపుతున్నమని ఆమె అన్నారు. ప్రభుత్వం సహకారం అందించాలని,కార్పొరేట్ సంస్థలు,దాతలు ముందుకు వచ్చి మా సంస్థ లో భాగస్వామ్యం అయినట్లయితే దివ్యాంగులకు మరిన్ని సేవలు విస్తరిస్తామని రజిత వెంకట్ పేర్కొన్నారు.
అనంతరం విజయవాడ యూసానా హెల్త్ సైన్సెస్ వారి సహకారంతో స్పందన బాలలకు,వారి తల్లిదండ్రులకు ప్రజలకు,దివ్యాంగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడినవి.
ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యండ్స్ సొసైటీ చైర్మన్ సంకాబత్తుల వెంకట్,ఎంఆర్పిఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఎలీషా ,సీనియర్ కోచ్ శ్రీమతి మధు మోహన్,తమన్న, రమేష్, మహేందర్,యెహోవా,
స్పందన మానసిక వికాస కేంద్రం తల్లిదండ్రులు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు


