*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:-*
*స్నేహ MACS భారీ ఆర్థిక మోసాన్ని విశాఖపట్నం సిటీ పోలీసులు చేదించారు; ప్రధాన నిందితుల అరెస్ట్, ఆస్తుల జాబితా సిద్ధం*
మోసం మరియు FIRల సంక్షిప్త చరిత్ర:
విశాఖపట్నం సిటీ పోలీసులు “స్నేహా MACS” (Sneha Mutually Aided Co-operative Society Ltd.) మరియు దానికి సంబంధించిన బినామీ సంస్థల పేరిట నిర్వహించబడిన భారీ ఆర్థిక మోసాన్ని వెలికితీశారు. యాజమాన్యం అధిక వడ్డీ ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి, ఆ మొత్తాలను వ్యక్తిగత ప్రయోజనాలకు మరియు బినామీ కంపెనీలకు మళ్లించి, విశాఖపట్నం మరియు ఇతర జిల్లాల్లో విస్తారంగా స్థిరాస్థులు కొనుగోలు చేసింది. ప్రధాన బాధితులు SC/ST సమాజ సభ్యులు మరియు ఇతర మధ్యతరగతి డిపాజిటర్లు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సిద్ధాంతాలు మరియు “Pay Back to Society” నినాదం నమ్మి తమ జీవన పొదుపులను పెట్టుబడి చేసినారు.
డిపాజిటర్ల నుండి వచ్చిన వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా, స్నేహా MACS యాజమాన్యం మరియు సంబంధిత సంస్థలపై విశాఖపట్నం నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అనేక FIRలు నమోదు చేయబడ్డాయి:
1. Cr. No. 166/2025 – దువ్వాడ PS, నమోదు: 22.04.2025
2. Cr. No. 85/2025 – ద్వారకా PS, నమోదు: 01.05.2025
3. Cr. No. 215/2025 – గోపాలపట్నం PS, నమోదు: 07.08.2025
4. Cr. No. 222/2025 – II Town PS, నమోదు: 18.12.2025
మోసం విధానం (Modus Operandi)
A.P. MACS Act, 1995 సెక్షన్ 29 ప్రకారం నిర్వహించిన దర్యాప్తు మరియు పోలీస్ చట్టపరమైన విచారణలో వెల్లడైన ముఖ్యాంశాలు:
• “SC/ST Sneha MACS” (Regd. No. AMC/VSP/DCO/2008/2446) పేరుతో 2008లో రాజేంద్రనగర్, సీతమ్మపేట, విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన ఈ సోసైటీ పేరు 2014లో అసలు SC/ST సభ్యులకు తెలియజేయకుండా “Sneha MACS” గా మార్చబడింది.
• అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రచారం చేస్తూ, అధిక వడ్డీ వాగ్దానాలు చేసి, ముఖ్యంగా SC సభ్యులను ఏజెంట్లు మరియు సిబ్బంది ద్వారా పెట్టుబడులకు ప్రోత్సహించారు.
• కానీ, ఆ డిపాజిట్లను సహకార ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు, బినామీ పెట్టుబడులు, మరియు అక్రమ ఆస్తుల కొనుగోలుకు మళ్లించారు.
విచారణ నివేదిక ప్రకారం:
• Sneha MACS కి మొత్తం 2,504 మంది డిపాజిటర్లు ఉన్నారు.
• చెల్లించవలసిన మొత్తం డిపాజిట్లు: ₹55.10 కోట్లు
• అక్రమ రుణాలు, నిబంధనలకు వ్యతిరేకంగా నిధులను మళ్లించడం కారణంగా విశాఖపట్నం MACS ఖాతాల నుండి హైదరాబాద్, పన్నూరు MACSలకు మరియు అనేక బినామీ సంస్థలకు సుమారు ₹56.10 కోట్లు మళ్లించబడినట్లు బయటపడింది.
ప్రధాన నిందితులు
ఈ కేసుల్లో ముఖ్య నిందితులు:
• వ్యవస్థాపక అధ్యక్షుడు : కటికల శివ భాగ్యరావు
• అధ్యక్షరాలు (President) : కె. స్వర్ణలత
• వారి కుమారులు : కె. శ్రీకాంత్, కె. క్రాంతి కుమార్
• డైరెక్టర్లు మరియు CEO : ఏ. పున్నారావు
• బినామీ సంస్థలు : ప్రుధ్వి కన్స్ట్రక్షన్స్, యునైటెడ్ పబ్లికేషన్స్, స్నేహ ప్రియా ఫైనాన్షియల్ సర్వీసెస్, వీటిని ఎస్. ధనుంజయ శరత్, గుమ్మడి మనోరంజన్ ఇతర బినామి లు నిర్వహించారు.
లుక్ అవుట్ నోటీసులకు పంపిన ప్రతిపాదనలు :
కె. స్వర్ణలత
కే. శ్రీకాంత్
3. అల్లాడి పున్నారావు
4. గుమ్మడి మనోరంజన్
5. కె. క్రాంతి కుమార్
వివిధ కేసుల్లో అరెస్టులు :
• Cr. No. 166/2025 (దువ్వాడ PS): మతూరి శ్రీనివాసరావు, గుమ్మడి మనోరంజన్, ఉండవల్లి శ్రీనివాసరావు, గూడూరి సీతా మహాలక్ష్మి, లిఖితపూడి విశ్వేశ్వరరావు, పి. శ్రీహరి రాజు, గుంటక రంగారావు, జంపరంగి ధనలక్ష్మి, సజ్జా ధనుంజయ శరత్ తదితరులు అరెస్టై రిమాండ్‌కు పంపబడ్డారు.
• Cr. No. 215/2025 (గోపాలపట్నం PS): సజ్జా ధనుంజయ శరత్ అరెస్టై రిమాండ్‌కు వెళ్లారు.
Cr. No. 85/2025 (ద్వారకా PS): మదిరి విజయ్‌కుమార్ (Sneha TV, Sneha Spoorthy Chits), కటికల శ్రీకాంత్, కటికల క్రాంతి కుమార్ అరెస్టై రిమాండ్‌కు పంపబడ్డారు.
Cr. No. 222/2025 (II Town PS): ప్రధాన నిందితుడు కటికల శివ భాగ్యరావు 04-12-2025న అరెస్టై కోర్టులో హాజరుచేయబడి రిమాండ్ అయ్యారు.
బినామీ ఆస్తుల గుర్తింపు :
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మరియు తహసీల్దార్లకు పంపిన రిక్విజిషన్ల మేరకు సర్టిఫైడ్ కాపీలు సేకరించి, భూములను సర్వే చేసి, జియోట్యాగ్ చేసి, మళ్లించిన డిపాజిటర్ల డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులు గుర్తించబడ్డాయి:
వెంకన్నపాలెం / రాయపురాజుపేట వద్ద కుటుంబ సభ్యులు మరియు ప్రుధ్వి కన్స్ట్రక్షన్స్ బినామి పేర్లలో సుమారు 21.12 ఎకరాలు (డాక్యుమెంట్ నంబర్లు: 3075/2011, 5727/2011, 9625/2012, 9655/2012, 3789/2014, 3926/2014 మొదలైనవి).
ఎలమంచిలిలో దుప్పిటూరు గ్రామంలో 0.47 ఎకరాలు, దబ్బందలో 1.50 ఎకరాలు – Sneha Priya Financial Services పేర్లలో.
శీలనగర్ STBL దగ్గర 2450 చ.గజాలు — యునైటెడ్ పబ్లికేషన్స్ పేరిట.
చిన్నవాల్తేర్‌లో అక్షయ సత్యప్రసాద్ విస్టాలో 2125 చ.అడుగుల ఫ్లాట్ – ₹96,00,000కు గుమ్మడి మనోరంజన్ పేరిట.
మర్రిపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో 350 చ.గజాలు – Sneha Priya Financial Services పేరుతో.
ఇవి అన్నీ మోసపూరితంగా మళ్లించిన ప్రజా డిపాజిట్లతో కొనుగోలు చేసిన ఆస్తులే.
ప్రస్తుతం కేసు స్థితి :
• A.P. MACS Act సెక్షన్ 29 ప్రకారము కోర్టు విచారణ పూర్తయి, వ్యవస్థాపకులు, అధ్యక్షులు, డైరెక్టర్లు మరియు బినామీ సంస్థలపై క్రిమినల్ చర్యలు, అలాగే ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం సిఫార్సు చేయబడింది.
• పోలీసు వివిధ కేసుల్లో కీలక నిందితులను అరెస్టు చేసి, PT వారెంట్లు అమలు చేసి సంబంధిత కేసులకు కనెక్ట్ చేస్తున్నారు.
• గుర్తించిన ఆస్తులపై మరిన్ని లావాదేవీలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్లకు హోల్డ్ పెట్టమని రిక్విజిషన్లు పంపబడ్డాయి.
• మళ్లించిన నిధుల రికవరీ కోసం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి; ఇంకా గుర్తించాల్సిన బాధితులు మరియు బినామీ ఆస్తుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.


