రాపూరు, మే 31, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు పట్టణంలో స్నేహ హస్తం ఫౌండేషన్ వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆదర్శప్రాయంగా ఉండి. గత ఐదు సంవత్సరాలుగా రాపూరు మండలం లోనే గాక ఇతర మండలాల్లో సైతం పేద ప్రజలకు వైద్యం, ఆహారం,విద్య మొదలగు సేవలను అందిస్తూ మరణించిన పేద కుటుంబాల వ్యక్తుల కర్మ క్రతువులకు ఆర్థిక సహాయం అందజేస్తున్న స్నేహ హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో తూర్పు అగర్తకట్ట వద్ద ఉపాధి లేక జీవిస్తున్న గిరిజన చల్ల యానాదులు 500 మంది అన్నదానానికి బండి కృష్ణా రెడ్డి మాజీ MPP రాపూరు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ బండి వేణు గోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది.మరియు గత 61 రోజులుగా స్నేహ హస్తం ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని వెన్నంటి ఉంటూ గత 61 రోజులుగా అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.