– ప్రమాదవశాత్తు మరణించిన చాకలి గణేష్‌కు ఆర్థిక సహాయం
కామారెడ్డి, 14 జనవరి, పున్నమి ప్రతినిధి :
స్నేహిత్వం అంటే ఏమిటో చూపించిన కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, పోసానిపేట్ గ్రామ దోస్తులు, ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన చాకలి గణేష్ కుటుంబానికి ఎస్‌ఎస్‌సి బ్యాచ్ 2005-06 సహోద్యోగులు కలిసి భారీ ఆర్థిక సహా యం అందజేశారు. పాత స్నేహితుడి కుటుంబాని కి భరోసా కల్పించేందుకు ఈ సహాయం అందరికీ సహాయం చేసిన వారు అవుతారు .చాకలి గణేష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. ఈ సందర్భం గా, 2005-06 సంవత్సరం ఎస్‌ఎస్‌సి బ్యాచ్‌కు చెందిన స్నేహితులు అందరూ ఏకమై, కుటుంబాని కి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం గ్రామం లో స్థానికులందరూ స్వాగతించారు.సహోద్యోగులు మాట్లాడుతూ, స్నేహితుడు లేని లోటును పూరించ లేకపోతాం కానీ, కుటుంబానికి మద్దతుగా నిలబడ తాం అని చెప్పారు.ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో స్నేహ సంబంధాల బలాన్ని తెలియ జేస్తోంది. స్థానిక పంచాయతీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. గణేష్ కుటుంబం ఈ సహాయం అందుబాటులోకి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసింది. ఈవిధంగా, స్నేహ సంబంధాలు కష్టకాలం లోనూ మద్దతుగా నిలుస్తాయని ఈ గ్రామస్తులు చెబుతున్నారు.ఈ సహాయ కార్యక్ర మంలో ఉపస ర్పంచ్ గండ్ర అంజయ్య, గోనె నరేష్, బండి నరేష్, నరేష్, నరేందర్, నవీణ్, అశోక్, బల్కం లింగం తదితరులు పాల్గొన్నారు.


