అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు నేస్తాపురం. ఆ ఊరిలో ఈ ఇద్దరు స్నేహితులు ఉన్నారు వారి పేర్లు అశోక్, అర్జున్. మీరిద్దరూ చిన్నప్పటినుండి మంచి స్నేహితులు కానీ అశోక్ కి అర్జున్ అంటే ఏదో తెలియని అసూయ ఉండేది కానీ దాన్ని ఎన్నడూ ఎవరి ముందర వ్యక్తపరచలేదు. అసూయ అనేది అశోక్ ఎప్పుడు బాగా చదివి మార్కులు సంపాదిస్తాడు అప్పుడు వస్తుంది. అర్జున్ అశోక్ చాలా మంచి మిత్రులు. వారి మధ్య ఎన్నడూ వైర్యం అనేది రాలేదు. అశోక్ కి అర్జున్ తో పాటు ఇంకా కొంత మంది మిత్రులు ఉన్నారు అర్జున్ కి కూడా కొంతమంది స్నేహితులు ఉన్నారు. అశోక్ కి స్నేహితులైన వారందరూ అర్జున్ కి స్నేహితులు కానీ అర్జున్ కి స్నేహితులైన వారు అశోక్ కి నచ్చేవారు కాదు అశోక్ స్నేహితులకు కూడా వారు నచ్చేవారు కాదు కానీ అర్జున్ స్నేహితులని ఎప్పుడు చిన్నచూపు చూడలేదు. అశోక్ స్నేహితులందరికీ అర్జున్ బాగా ఉండేవాడు. అర్జున్ పట్ల అశోక్ ఉన్న అసూయని అంతటిని ఒకరోజు అశోక్ తన మిత్రులకి చెప్పాడు. వాళ్ళు ఎందుకు అని ప్రశ్నిస్తే అశోక్ అర్జున్ మీద వాళ్ళకి అబద్దాలు చెప్పాడు. అది విన్న వాళ్లంతా అశోక్ ని తిట్టి నీలాంటి వాడితో మేము స్నేహం చేయము మనిషి ముందు ఒకలా మనిషి వెళ్ళిన తర్వాత ఒకలా మాట్లాడే మనస్తత్వం నీది నీతో మాకు స్నేహం ఇంతటితో తెగిపోయింది అని కఠినంగా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత కాసేపటికి అర్జున్ అక్కడికి వచ్చి ఏమైంది అశోక్ మన మిత్రులు అందరూ ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు. మళ్లీ ఏదో పని ఉందని అబద్ధం చెప్పి నీతో మాట్లాడటం ఇష్టం లేక వెళ్ళిపోయారు లే నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేదని నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని చెప్పారు. నేను దానికి మీరు ఎవరు నాకు అవసరం లేదు నాకు అర్జున్ మాత్రమే స్నేహితుడు మీరు నిజమైన వాళ్ళు కాదు నాకు నా మిత్రుడు మీద అబద్ధాలు చెప్పి నన్ను నా మిత్రుడిని విడదీయాలని అనుకుంటున్నారా అని నేనే వాళ్ళని తిట్టి పంపించాను అని అశోక్ అర్జున్ కి అబద్దం చెప్పాడు. దానికి అర్జున్ అశోక్ తో మన మిత్రులే కదా వదిలే. అయినా మన వాళ్ళని మనం తిట్టకూడదు సరే వాళ్ళ గురించి వదిలే మనకి ఇంకా కొన్ని రోజుల్లో పరీక్షలు ఉన్నాయి కదా వెళ్లి చదువుదాం పద అని అర్జున్ అశోక్ ని తీసుకొని వెళ్ళిపోయాడు. పరీక్షలు రానే వచ్చాయి ఎప్పుడు అశోక్ మొదటి స్థానం లభించేది కానీ ఈసారి అర్జున్ కి మొదటి స్థానం వచ్చింది ఉపాధ్యాయులందరూ అర్జున్ ని పొగిడారు అశోక్ స్నేహితులు అర్జున్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. అశోక్ తో జాగ్రత్తా ఉండమని హెచ్చరించి వెళ్లిపోయారు. అర్జున్ దానిని పట్టించుకోలేదు వారి మాటలను పెడచెవిన పెట్టాడు. ఉపాధ్యాయుడు ఒకరోజు అందరి ముందు అర్జున్ ని తరగతి గది పర్యవేక్షకుడిగా నియమించాడు అది చూసి అశోక్ తట్టుకోలేకపోయాడు. అప్పటినుండి అర్జునుని దూరం పెట్టడం మొదలుపెట్టాడు అర్జున్ ఎందుకు నన్ను దూరం పెడుతున్నావ్ అని అశోక్ ని అడిగాడు దానికి అశోక్ ఏమీ లేదు ఊరికనే అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. అర్జున్ అశోక్ స్నేహితుల దగ్గరికి వెళ్లి అశోక్ కి ఏమైంది అని అడిగాడు అశోక్ స్నేహితులు అర్జున్తో అశోక్ కి తన పట్ల ఉన్న అనసూయ ద్వేషాల గురించి చెప్పి తనతో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అర్జున్ దానికి వాళ్ళతో తన మిత్రుడు అలాంటివాడు కాదు అని చెప్పాడు మళ్ళీ పరీక్షలు వస్తున్నాయి అనగా ఉపాధ్యాయులు తరగతిలో ఉన్న పిల్లలందరితో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అర్జున్ ని అడిగి తెలుసుకోమన్నారు. దానికి తోటి విద్యార్థులు అందరూ ఆనందపడ్డారు ఒక్క అశోక్ తప్ప. విద్యార్థులు అర్జున్ దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడిగి సందేహాలు తీర్చుకొని వెళ్లారు. అశోక్ ఇదంతా దూరంగా కూర్చుని చూస్తున్నాడు తనకు దక్కాల్సిన గౌరవం అర్జున్ కి దక్కిందని ఎంతగానో కుమిలిపోయాడు. ఈసారి పరీక్షల్లో ఎలాగైనా మొదటి స్థానంలో రావాలని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకున్నాడు. చివరికి పరీక్షలు వచ్చే సమయానికి అశోక్ ఏమీ చదవలేదు పరీక్షలు ఎలా రాయాలో అర్థం కాక చిట్టా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అది గమనించిన అర్జున్ అశోక్ అలా చేయడం తప్పు అని చెప్పిన వినకుండా తిరిగి అర్జునుని దుర్భాషలాడి తన స్థానంలో వెళ్లి కూర్చున్నాడు. అది గమనించిన తోటి విద్యార్థులు అర్జున్ దగ్గరకు వెళ్లి అశోక్ గురించి ఉపాధ్యాయుడికి చెప్పమని అడిగారు. అశోక్ వాళ్ళ మాటలు వినకుండా తిరస్కరించి ఉపాధ్యాయుడికి చెప్పలేదు. సరే నువ్వు చెప్పకపోతే మేమే వెళ్లి చెప్తామని తోటి విద్యార్థులు చెప్తే దానికి అర్జున్ ది అశోక్ మొదటి తప్పుగా భావించి వదిలేయండి అని చెప్పాడు. అందుకు వాళ్లు అర్జున్తో అసలు నీకు బుద్ధుందా అని అడిగారు నీ గురించి వాడు మాకు చెడుగా చెప్పి నిన్ను మా దృష్టిలో వెదవని చేద్దామని చూస్తున్నాడు. కానీ నువ్వు వాడే నాకు ప్రాణ స్నేహితుడు అన్నట్లు భావిస్తున్నావ్ అని అర్జునుని కాస్త గట్టిగా తిట్టారు. అందుకు అర్జున్ మీరు తన గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మను కాక నమ్మను అని వాళ్ళతో చెప్పాడు. వాళ్లు అర్జున్ ని నీకు అసలు బుద్ధుందా మేము నీ గురించి ఆలోచించి చెప్తుంటే నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావు అని అంటారు. ఇంతలో ఉపాధ్యాయులు గారు రావటంతో అందరూ తమ స్థానాలు వెళ్లడానికి గబగబా పరిగెడతారు. అలా వాళ్ళు వెళ్లే లోపల ఉపాధ్యాయులు గారు వారిని చూసి ఎందుకు అంత హడావిడి అయినా మీకు అర్జున్తో ఏం పని ఉంది పరీక్ష సమయంలో ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని గట్టిగా అడిగే సరికి అశోక్ గురించి చెప్పబోతాడు ఇంతలో అర్జున్ జోక్యం చేసుకొని అది ఏమి లేదు సార్ పరీక్ష పత్రం గురించి చర్చిస్తున్నామని అబద్ధం చెప్తాడు. కానీ ఉపాధ్యాయుడు ఏదో తప్పు జరుగుతోంది అని అర్థం చేసుకొని కృష్ణ అనే ఒక విద్యార్థిని అడగగా అతను నిజం చెప్తాడు. అది విని ఉపాధ్యాయుడు అశోక్ ని పరిశీలించగా అతని దగ్గర కొన్ని చిట్టాలు బయటపడ్డాయి ఉపాధ్యాయుడు అశోక్ ని పరీక్ష రాయనీకుండా చేసి బయట నిలబెట్టాడు. మిగతా పిల్లలంతా ఆనందంతో కేరింతలు కొట్టాలి కానీ అర్జున్ మాత్రం తన మిత్రుడు పరీక్ష రాయలేదన్న బాధతో ఉన్నాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి ఎప్పటిలానే అర్జున్ మొదటి స్థానంలో వచ్చాడు అది చూసి అశోక్ మరింత అసూయతో ఊగిపోయాడు. అర్జున్ మాత్రం తన మిత్రుడు బాధగా ఉండటం చూడలేక వెళ్లి అతని బాధకు గల కారణాన్ని చెప్పమని అడిగాడు అశోక్ తన మనసులో ఉన్న బాధని, ఆక్రోసాన్ని, అసూయని అర్జున్ ముందు పెట్టాడు. అర్జున్ దానికి నామీద నీవు ఇంత దేశాన్ని పెంచుకోవడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. అశోక్ నీ వల్ల నేను తరగతిలో ఉత్తీర్ణుడిని కాలేకపోతున్నాను నువ్వు వచ్చినప్పటి నుండి నాకు మంచి మార్కులు రావట్లేదు. నీతో స్నేహం చేసి నిన్ను తప్పుదారి పట్టిద్దామని అనుకున్నాను అలానే స్నేహం చేశాడు కానీ నేను ఊహించిన దానికి విరుద్ధంగా నీవు రోజురోజుకీ అందరి మనసులో గొప్ప స్థానం సంపాదించుకుంటున్నావు అది చూసి తట్టుకోలేక నేను నీ గురించి చెడుగా చెప్ప. కానీ ఎవ్వరు నా మాట వినలేదు నిన్నే నెత్తి మీద పెట్టుకున్నారు నిన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నా స్వార్థం కోసం నిన్ను దూషిస్తూ పరీక్షల్లో చిట్టాలు పెట్టాను కానీ నువ్వు నీ మిత్రులు నన్ను ఇరికించారు .అప్పుడు అర్థమైంది నువ్వు నీ స్వార్థం కోసం నన్ను వాడుకున్నావు అని. అది వింటూనే అర్జున్ అశోక్ చంప పగలగొట్టాడు. అశోక్ చిలిపి కొట్టబోతుంటే అతని చెయ్యి పట్టుకుని ఇంకో చెంప వాయించాడు నీవు చేసిన పనులు నాకు తెలియదు అనుకుంటున్నావా. నువ్వు నన్ను ఎన్ని విధాలుగా మార్చాలనుకున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ప్రతి విషయంలో నన్ను తప్పుదారి లో నడిపిస్తున్నావు అని నాకు తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నాను తెలుసా నీ తప్పును నువ్వు తెలుసుకొని మారుతావు అని మాత్రమే. నేను నిన్ను ఇరికించానా. నేను నిజంగా నిన్ను ఇరికించాలి అని అనుకొని ఉంటే అప్పుడే ప్రధానోపాధ్యాయుల వారి దగ్గరికి వెళ్లి నీ గురించి చెప్పి ఉండేవాడిని. నా స్నేహితుడివి అని మాత్రమే ఆగాను. కానీ నువ్వు మారలేదు అందుకే నీతో ఇంక మాట్లాడదలచలేదు నీ గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా పట్టించుకోలేదు నువ్వు నీ గురించి ఆలోచించి చదువు మీద శ్రద్ధ చూపు ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు మీ ఈ దయనీయ స్థితికి అంతటికి నీవే కారణం నీ స్వార్థమే కారణం. నమ్మిన స్నేహితుడిని మోసం చేయాలని చూసావు దానికి ప్రతి క్రియగా నీవే మోసపోయావు. కనుక ఇక్కడ నుండైనా మారి నీమీద నీ మనసు మీద అన్నిటికంటే ముఖ్యంగా నీ చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువు. నన్ను ఎలా నాశనం చేయాలి అని కాదు ఎంత శ్రద్ధగా చదవాలి అని ఆలోచించు అని చెప్పి అక్కడ నుంచి అర్జున్ వెళ్లిపోయాడు. అశోక్ కి ఏం చేయాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు మొదలయ్యాయి. అందులో ఈసారి అశోక్ మొదటి స్థానంలో వచ్చాడు. అది చూసి ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు మళ్ళీ ఒకసారి అశోక్ ని పిలిచి ప్రశ్నలు అడిగారు అశోక్ తట పటాయించకుండా సమాధానాలు చెప్పాడు. ఉపాధ్యాయులు ప్రశ్నలు అడగడం అయిపోయిన తర్వాత అర్జున్ అశోక్ దగ్గరకు వెళ్లి శభాష్ మిత్రమా నువ్వు సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. దానికి అశోక్ ఇదంతా నీ వల్లే మిత్రమా నువ్వు ఆ రోజు నన్ను మందలించకపోయి ఉంటే నేను మారుండే వాడిని కాదు దీనికి కారణం నీవే అని ఆనందంగా చెప్తాడు. మళ్ళీ ఇద్దరు మిత్రులు ఒకటైపోయారు, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు.
“స్నేహం ఒక తీయని కల, స్వార్థం ఆ కథను చిత్రం చేసే చేదు నిజం.”
“స్వార్థం ప్రవేశించిన చోట, స్నేహం ఊపిరి వదిలేస్తుంది.”
నీతి:- స్వార్థం అనేది ఎంతటి బంధాన్ని అయినా విడదీస్తుంది స్వార్థం అనే దానిని వదిలేస్తే నే మనిషి మంచి గా ఎదుగుతాడు. సమాజంలో మంచి పేరును సంపాదించుకోగలుగుతాడు. కథలో అశోక్ స్వార్థానికి దగ్గరయ్యాడు స్నేహాన్ని కోల్పోయాడు తన స్పాట్ దాన్ని విడిచి స్నేహితుని మాట విన్నాడు తిరిగి స్నేహాన్ని తన మంచి కోరే మిత్రుడిని పొందాడు.


