పున్నమి: రాజకీయ ప్రాధాన్యం లేని ఆదివాసి ఎరుకల కులస్తులకు అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు డిమాండ్ చేశారు. ఆదివారం బంజారాహిల్స్ లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసి ఎరుకలకు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక చాలా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ శాసనమండలిలో మా తరఫున మాట్లాడే వారే లేక సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. రాజ్యాంగం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు ఎరుకల కులస్తులకు రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా తొక్కి పెట్టడం అణిచివేతకు నిదర్శనమని మండిపడ్డారు.ఇతర కులాలకు అవకాశాలు కల్పించినప్పుడు ఎరుకల కులస్తులకు రాజకీయంగా ఎందుకు ఇవ్వడం లేదని ఆయా రాజకీయ పార్టీలను ప్రశ్నించారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు ఆదివాసి ఎరుకల జాతిని గుర్తించి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయా పార్టీలకు జాతి నుండి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసి ఎరుకల కులస్తులకు ప్రాధాన్యత కల్పించాలి.. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం అధ్యక్షులు రాజు డిమాండ్..