Monday, 30 March 2026
  • Home  
  • స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం: ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా గెలిపించాలి 
- ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం: ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా గెలిపించాలి 

– కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  కామారెడ్డి, 28 సెప్టెంబర్,  పున్నమి ప్రతినిధి   :  కామారెడ్డి జిల్లాలో జిల్లాలో జెడ్పిటిసి, ఎంపిటిసి,  సర్పంచ్, వార్డు ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కృషి చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జన తా పార్టీ (బీజేపీ) పూర్తిస్థాయిలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కామారెడ్డి శాసన సభ్యులు  కాటి పల్లి వెంకట రమణ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికలను కార్యకర్తలను ప్రజాప్రతిని ధులుగా చేసే ఎన్నికలుగా అభివర్ణించారు.స్థానిక సంస్థల ఎన్నికలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు అయిన నేప థ్యంలో, రాబోయే ఎన్నికల సన్నద్ధత పై బీజేపీ జిల్లా కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షత వహించారు.ముఖ్య అతి థిగా హాజరైన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి నాయకుల నుండి మొదలుకొని జిల్లా, మండల, బూత్ స్థాయి నాయకుల వరకు ప్రతి బీజేపీ కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.ఆయన మరింతగా మాట్లాడు తూ, ఈ ఎన్నికలు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్య కర్తను ప్రజాప్రతినిధిగా చేసే అవకాశం కల్పిస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఏకతాటిపై నిలబడి పనిచేయాలి. పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, స్థానిక సంస్థల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలి,” అని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు అయిన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక ఆలస్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో సన్నద్ధత ప్రారంభించాలని సూచించారు.

– కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 కామారెడ్డి, 28 సెప్టెంబర్,  పున్నమి ప్రతినిధి   :

 కామారెడ్డి జిల్లాలో జిల్లాలో జెడ్పిటిసి, ఎంపిటిసి,  సర్పంచ్, వార్డు ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కృషి చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జన తా పార్టీ (బీజేపీ) పూర్తిస్థాయిలో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని కామారెడ్డి శాసన సభ్యులు  కాటి పల్లి వెంకట రమణ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికలను కార్యకర్తలను ప్రజాప్రతిని ధులుగా చేసే ఎన్నికలుగా అభివర్ణించారు.స్థానిక సంస్థల ఎన్నికలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు అయిన నేప థ్యంలో, రాబోయే ఎన్నికల సన్నద్ధత పై బీజేపీ జిల్లా కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షత వహించారు.ముఖ్య అతి థిగా హాజరైన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి నాయకుల నుండి మొదలుకొని జిల్లా, మండల, బూత్ స్థాయి నాయకుల వరకు ప్రతి బీజేపీ కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.ఆయన మరింతగా మాట్లాడు తూ, ఈ ఎన్నికలు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్య కర్తను ప్రజాప్రతినిధిగా చేసే అవకాశం కల్పిస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఏకతాటిపై నిలబడి పనిచేయాలి. పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, స్థానిక సంస్థల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలి,” అని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు అయిన నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక ఆలస్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో సన్నద్ధత ప్రారంభించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.