పున్నమి: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేష్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో రెండ్రోజుల పాటు వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండబోదని వాదించారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు