స్థానిక చిన్న పత్రిక ఎడిటర్లకు శుభవార్త … ..
*అమరావతిడిసెంబర్ 11 విశాఖ పున్నమి ప్రతినిధి
జర్నలిస్ట్ మిత్రులారా…
మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒడిదుడుకులకు లోనై పత్రికలను నిరంతరం వెలువరిస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ స్థానికంగా అన్ని జిల్లాల్లో ఉన్న సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఎం ప్యానల్ మెంట్ లేని చిన్న పత్రికలను ఉమ్మడి జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో అక్రి డేషన్స్ తీసుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో మీడియం అండ్ స్మాల్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ నవ్యాంధ్రప్రదేశ్ నాయకులు నేడు సెక్రటేరియట్ 1 బ్లాక్ లో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ K.S విశ్వనాధన్ గారిని కలిసి మన పరిస్థితులను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. చిన్న పత్రికలకు ఉమ్మడి జిల్లాల్లో అక్రిడేషన్స్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. అర్.ఎన్.ఐ.కలిగి ఉన్న జిల్లా కాక కొత్త జిల్లాలో కూడాఆక్రిడే షన్ తీసుకునే అవకాశం కల్పించిన సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం.అధ్యక్షులు చంద్రశేఖర్, సెక్రటరీ గురుకాంతాచారి డైరెక్టర్ ను కలిసి జర్నలిస్ట్ ల సమస్యలపై చర్చించడం జరిగింది.


