స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
అక్కయ్య పాలెం నారాయణ ఇంగ్లీష్ మీడియo పాఠశాలలో “స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ” వినూత్న పద్ధతిలో దిగ్విజయంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లి దండ్రులు పాల్గొని, విద్యార్థుల యొక్క ప్రశ్నాపత్రాలు పరిశీలించడమే కాకుండా ఇప్పటి వరకు పూర్తి అయిన పాఠ్యాంశాల నుంచి నేరుగా ప్రశ్నలను అడిగి వాళ్ళలో “నిబిడీ క్రృతమైన సృజనాత్మక శక్తిని”తెలుసు కున్నారు.
ఈ రకమైన బోధనలతో తల్లి దండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం నారాయణ పాఠశాల” ఏ.జి.యం.రాజ్ కుమార్ గారు, ప్రిన్సిపాల్ కె.ఉషారాణి గారు,కో ఆర్డినేటర్ వి.లావణ్య గారు, విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను ,ఈ రకమైన ప్రోగ్రామ్స్ ని, నిర్వహించడం ద్వారా తల్లి దండ్రులు నేరుగా వారి వారి పిల్లలలో వివిధ అంశాల పట్ల అవగాహన ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు.
ఇది ఒక వినూత్న మైన ప్రక్రియగా ప్రతీ ఒక్కరూ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో,”వైస్. ప్రిన్సిపాల్ శ్వేత” తో పాటు ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు..


