విశాఖపట్నం: జనవరి (పున్నమి ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సింటర్ ప్లాంట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడడంతో మృతి చెందాడు. గాజువాక సమీపంలోని అజీమాబాద్‌కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) గురువారం విధులు ముగించుకుని ఎత్తైన ప్లాట్‌ఫామ్ నుంచి కిందకు దిగుతుండగా అదుపు తప్పి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే స్టీల్ ప్లాంట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు సుబాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.



