రామారెడ్డి, 30 నవంబర్, పున్నమి ప్రతినిధి
రామారెడ్డి మండల పరిధిలో గల గ్రామ పంచాయ తీల సర్పంచ్, వార్డ్ సభ్యుల నామినేషన్ పత్రాల పరిశీలన (స్క్రూటినీ) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. సంబంధిత రిటర్నింగ్ అధికారి ఆధ్వ ర్యంలో ఉదయం ప్రారంభమైన స్క్రూటినీలో దాఖలైన మొత్తం నామినేషన్లను ఒక్కొక్కటిగా పరిశీలించి అర్హత నిర్ణయించారు.అధికారిక సమాచారం ప్రకారం, మండల వ్యాప్తంగా సర్పంచ్ పదవికి దాఖలైన నామినేషన్లలో ఎక్కువ శాతం సరైన పత్రాలు, రుజువులతో ఉండటం వల్ల అవి చెల్లుబాటు అయ్యాయి.కొద్దిపాటి లోపాలున్న పత్రాలను మాత్రమే తిరస్కరించారు. తిరస్కరణ కు గురైన అభ్యర్థులకు కారణాలు లిఖిత పూర్వకం గా అందజేయగా, సవరించిన అభ్యంతరాలు స్వీకరించే గడువు గురించి కూడా సూచనలు ఇచ్చినట్లు మండల రెవెన్యూ అధికార వర్గాలు తెలిపాయి.వార్డ్ సభ్యుల స్థానాలకు ఇదే వేళ స్క్రూటినీ పూర్తి చేయగా, ఎక్కువ గ్రామాల్లో పోటీ మలుపుతిప్పే అభ్యర్థుల తుద జాబితా బుధవా రం ప్రచురించనున్నారు. అర్హత పొందిన అభ్యర్థుల తుది జాబితా విడుదలైన వెంటనే గుర్తు కేటాయిం పు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాల ప్రదర్శన వంటి తదుపరి ఎన్నికల కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.ఎన్నికల ప్రక్రియ పారదర్శ కంగా, ఎలాంటి ఆందోళనలూ లేకుండా సాగడానికి అన్ని గ్రామాల్లో అవసరమైన భద్రతా ఏర్పాట్లు, వెబ్‌కాస్టింగ్ వంటి చర్యలు చేపట్టనున్నట్లు అధికా రులు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యా న్ని బలోపేతం చేయడానికి ప్రతి ఓటరు తప్పనిస రిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. మండలంలో 18 గ్రామాలకు 103 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు వచ్చినవని, 18 గ్రామాల వార్డులు 166 పోలీస్ పోలింగ్ కేంద్రాలకు 422 వాడు నామినేషన్ తుది జాబితా పత్రాలు సరిచేశామని తెలిపారు.


