Thursday, 5 February 2026
  • Home  
  • స్కాలర్షిప్లు ప్రభుత్వ బిక్ష కాదు – విద్యార్థుల హక్కు*
- నాగర్‌కర్నూల్

స్కాలర్షిప్లు ప్రభుత్వ బిక్ష కాదు – విద్యార్థుల హక్కు*

అక్టోబర్28 పున్నమి ప్రతినిధి: *అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో కల్వకుర్తి కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది* *విద్యార్థుల స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై ఎమ్మెల్యే గారు స్పందించాలి:- నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్* మంగళవారం ఈ సందర్భంగా నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్ మాట్లాడుతూ “విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవతితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులుSC,ST,BC బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని,వారందరూ కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యశిస్తున్నారన్నారు.కానీ ఈ ప్రభుత్వం సుమారు 8600 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల దగ్గర నుండే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆ ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని,విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు కూడా పొందలేక పోతున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛంద బందుకు పిలపునిచ్చాయని, అనేక ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ ఈ స్కాలర్షిప్ విషయంలో స్పందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ ప్రశాంత్ యాదవ్ నగర సంయుక్త కార్యదర్శి హరి కృష్ణ, శివరాం శ్రీకాంత్ మోహన్ కార్యకర్తలు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అక్టోబర్28 పున్నమి ప్రతినిధి:
*అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో కల్వకుర్తి కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది*
*విద్యార్థుల స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై ఎమ్మెల్యే గారు స్పందించాలి:- నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్*
మంగళవారం ఈ సందర్భంగా నగర కార్యదర్శి అక్కి వంశీ గౌడ్ మాట్లాడుతూ “విద్యారంగంలో మంచి మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవతితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులుSC,ST,BC బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని,వారందరూ కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యశిస్తున్నారన్నారు.కానీ ఈ ప్రభుత్వం సుమారు 8600 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల దగ్గర నుండే యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఆ ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని,విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సైతం సర్టిఫికెట్లు కూడా పొందలేక పోతున్నారన్నారు.
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛంద బందుకు పిలపునిచ్చాయని, అనేక ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ ఈ స్కాలర్షిప్ విషయంలో స్పందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ ప్రశాంత్ యాదవ్ నగర సంయుక్త కార్యదర్శి హరి కృష్ణ, శివరాం శ్రీకాంత్ మోహన్ కార్యకర్తలు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.