Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు

Punnami Newsroom Published: Updated:
సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు

పందలపాకలో పీఎం సూర్యఘర్‌పై అవగాహన సదస్సు

బిక్కవోలు, అక్టోబరు 9 (పున్నమి ప్రతినిధి): పందలపాక ఎన్టీఆర్ కాలనీలో సేవాసేతు కార్యక్రమంలో భాగంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి సబ్సిడీ సోలార్ ప్యానెళ్ల ప్రదర్శనను ప్రారంభించారు. సౌర విద్యుత్తుతో విద్యుత్తు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు. ప్రజలు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని పందలపాక ఎన్టీఆర్ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, విద్యుత్తు శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు

సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు

సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు

సౌర విద్యుత్తుతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *