ముధోల్, అక్టోబర్ 7 (పున్నమి ప్రతినిధి ):
అకారణ వర్షాల దెబ్బతో రైతుల సోయా పంట తీవ్రంగా నష్టపోయింది. మధ్యలో వర్షాభావం, ఇప్పుడు అకాల వర్షాలు — ఇలా రెండు దెబ్బలతో సోయా పంట రైతులు కష్టాల్లో కూరుకుపోయారు.
గత నాలుగు రోజులుగా వర్షం తగ్గడంతో రైతులు సోయా కుప్పలు నీటిలోనే ఉన్నాయి వర్ష బీభత్సవానికి రైతు కోతకు సిద్ధమవుతుండగా, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం మరోసారి పంటలను నీటమునిగేలా చేసింది. దీంతో కోతకు సిద్ధమైన పొలాలు చెడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ తడిగసిన కారణంగా వత్తిపంటలు పాడైపోతున్నాయని, ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మార్కెట్‌లో సోయా ధర కూడా పడిపోవడంతో రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారు.
వ్యవసాయ అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి సహాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
“వర్షం దేవుడు కనికరించాలి… లేదంటే రైతుల పరిస్థితి మరింత దయనీయమవుతుంది” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


