(పున్నమి ప్రతినిధి తేదీ 6 .10. 2025 నిర్మల్ జిల్లా)ముధోల్,
రైతులు ఎంతో శ్రమించి పండించిన సోయాబీన్ పంటలను న్యాయమైన ధరలతో విక్రయించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని ముధోల్ మాజీ ఎమ్మెల్సీ పోతన్న యాదవ్ కోరారు.
ప్రస్తుతం మార్కెట్లో సోయా పంటకు ప్రభుత్వం మధ్యధర రూ.5300 ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల దయపై ఆధారపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు నేరుగా లాభం చేకూరుతుందనీ, లేకపోతే మధ్యవర్తులు వారి కష్టానికి వడ్డీలా లాభాలు దోచుకుంటారని హెచ్చరించారు.
ఇక, ప్రైవేట్ వ్యక్తులు తక్కువ ధరలకు పంటను సేకరించే పరిస్థితులను ప్రభుత్వం నివారించాలి అని ఆయన పేర్కొన్నారు.
అలాగే, ఇటీవలి భారీవర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం ప్రకటించి రైతులకు ఉపశమనం కల్పించాలి అని డిమాండ్ చేశారు.
“సోయాబీన్ పంట రైతుల ప్రధాన ఆదారమైన పంట. కాలం చెల్లిపోకముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. లేకపోతే రైతులు నష్టాల బారిన పడతారు” అని హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.


