”
బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేరును కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లా నుంచి ఓబీసీ మోర్చా కోస్తా ఆంధ్ర జోనల్ ఇంచార్జ్ ముక్కు రాధాకృష్ణ గౌడ్ , బిజెపి కోపరేటివ్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ కోట వెంకటేశ్వర్లు మరియు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర తదితరులు విజయవాడలోని రాష్ట్ర కార్యాలయము నందు ఆయనను కలసి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోము వీర్రాజు చిన్నతనం నుండి ఆర్ఎస్ఎస్ విద్యార్థి దశలో ఏబీవీపీ అలాగే యువమోర్చా నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలై రాష్ట్ర జాతీయ పదవులను నిర్వహించి వాటికి వన్నెతెచ్చారని. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నారని అటువంటి నాయకునికి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్సీ ని కేటాయించడం ప్రతి కార్యకర్త గర్వించదగినటువంటి విషయమని అన్నారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ని ప్రకటించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారని నిజమైన కార్యకర్తకు గౌరవం దక్కిందని ఆనందిస్తున్నారని ఇది కేవలం బిజెపి పార్టీలో మాత్రమే జరుగుతుందని మిగతా రాజకీయ పార్టీలలో సాధ్యం కాదనితెలిపారు.