సోమిరెడ్డి నీ సోది రాజకీయాలు ఆపు

    0
    176

     

    రాజకీయంగా పతనం అయినా బుద్ది మారలేదు

    నీ రాజకీయ అవసరాలకు కాలువలకు నీరు వదలరు

    నువ్వు మంత్రిగా ఉన్నపుడు రైతులు ట్యాంకర్లతో నిమ్మతోటలకు తోలుకున్న నీళ్ల బిల్లులు బేబులో వేసుకున్నావు

    రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయావు, ప్రజలు నిన్ను మర్చిపోయారు

    మంత్రిగా ఉండి భారీ మెజారిటీతో ఓడావు

    లో లెవల్ స్లూయీజ్ కు నీరు వదలమని నువ్వు చెప్పలేదా

    సోమిరెడ్డిపై ఎస్ఆర్ సీపీ నాయకుల ధ్వజం
    ……………………………..
    రాజకీయ మనుగడ కోల్పోయిన సోమిరెడ్డి సోది రాజకీయాలు చేస్తూ తానేదో రైతుల కోసం పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పొదలకూరు లో వారు మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.

    *వారేమన్నారంటే*
    ……………………….
    సోమిరెడ్డి రాజకీయ అవసరాలకు కాలువలకు నీటిని విడుదల చేయరు

    రైతుల అవసరాల మేరకే కాలువలకు నీటిని విడుదల చేస్తారు

    రైతుల సాగు, తాగునీటి అవసరాలు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డిగారికి తెలుసు

    లోలెవల్ స్లూయీజ్ కు నీటిని విడుదల చేయమని నువ్వు చెప్పలేదా

    ఇపుడు హైలెవల్ స్లూయీజ్ కు నీరువిడుదల చేయాలని నీ రాజకీయ మనుగడకోసం నీ మనుషుల ద్వారా అడిగిస్తున్నావు

    రైతులకు అవసరమైతే హైలెవల్ స్లూయీజ్ కు నీటిని విడుదల చేయిస్తాము, నువ్వు నీ రాజకీయ అవసరాలకు చెపితే విడుద చేయరు

    ఎడమకాలువ కింద నిమ్మతోటలు ఎక్కడ ఎండుతున్నాయో చెప్పగలవా?

    నువ్వు మంత్రి గా ఉన్నసమయంలో నిమ్మతోటలను బతికించుకునేందుకు రైతులు ట్యాంకర్లు పెట్టుకున్న బిల్లులను స్వాహా చేసిన చరిత్ర నీది

    రైతులు ఇప్పటికీ బిల్లులు వస్తాయని ఆశపడుతున్నారు

    నీ బ్రతుకంతా అవినీతి మయం, సర్వేపల్లి ప్రజలు ఎన్నిపర్యాలు ఛీకొట్టినా ఇంకా నియోజకవర్గాన్ని పట్టుకుని వ్రేలాడాలని చూస్తున్నావు

    మంత్రి హోదాలో ఐదోపర్యాయం అత్యంత దారుణంగా ఓడిపోయావు, నీకంటే అప్పటి జిల్లాకు చెందిన మరో మంత్రి నయం స్వల్ప మెజారిటీతో ఓడారు

    నీకు ప్రజలు రాజకీయ సమాది కట్టారు, నువ్వు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ గా మిగిలిపోయావు

    పదవిలో ఉన్నంత కాలం అధికారులను బెదిరించి పబ్బం గడుపుకున్నావు, నీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు

    ప్రతిపక్ష ఎమ్మెల్యే గా కాకాణి గారు ఉన్నసమయంలోనే ఏమిచేయలేకపోయావు, ఇపుడేమి చేయగలవు

    అభివృద్ధి, సంక్షేమం గురించి నీలాంటి అవినీతి పరులు చెపితే చేసిపరిస్థితిలో లేము, ఏడాదిపాలనలో అన్ని వర్గాలవారు ఆనందంగా జీవిస్తున్నారు

    సమావేశంలో మండలపార్టీ అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చిన బ్రహ్మయ్య, మాజీ సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, దాదిబత్తిన విజయభాస్కరరెడ్డి, మొలబంటి శేఖర్ బాబు, ఎస్కే అంజాద్, సోమా భాస్కరరావు, ఎడమగట్టు కాలువ కింద ఉన్న గ్రామాల రైతులు పాల్గొన్నారు.

    0
    0