నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావలిని రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసినందున ఈనెల 13 (సోమవారం ) న ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలు తెలిపారు.
అందువల్ల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించదలచుకున్న వారు సోమవారం వారి దరఖాస్తులను నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమర్పించవచ్చని ఆమె స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావలిని రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసినందున ఈనెల 13 (సోమవారం ) న ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలు తెలిపారు. అందువల్ల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించదలచుకున్న వారు సోమవారం వారి దరఖాస్తులను నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమర్పించవచ్చని ఆమె స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

