సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం .
-విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు.
-జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్.
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, అన్ని జోనల్ కార్యాలయాలలోనూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం” 2025 నవంబర్ 24 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు.
కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై నవంబర్ 24 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు


