కామారెడ్డి, 20 సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా బొంబోతుల స్వామి గౌడ్ శనివారం పన్నెడు మంది డైరెక్టర్లతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ, యూరియా కొరతను దృష్టిలో ఉంచుకొని 20 లక్షల చెక్కుపై మొట్టమొద టి సంతకం చేయడం జరిగిందన్నారు. మండలం లో యూరియా కొరత లేకుండా చూసుకుంటామని అన్నారు, రైతులకు అందుబాటులో ఉండి సహయ సహకారాలు అందిస్తానని తెలిపారు.


