మైదుకూరు పట్టణంలో MLA పుట్టా సుధాకర్ యాదవ్ గారి సొంత నిదులతో ఏర్పాటు చేసిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 77 CC కెమెరాలు పట్టణంలో ఏర్పాటు ..
మైదుకూరు డి.ఎస్.పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్’ ను ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మైదుకూరు ఎం.ఎల్.ఏ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, కర్నూల్ రేంజ్ డి.ఐ.జి శ్రీ డా.కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారు, జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పి.ఎస్ గారు
పట్టణంలో నిరంతరం నిఘా ఉంచేందుకు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, దొంగతనాలు, ఈవ్ టీజింగ్, తదితర నేరాల కట్టడిలో కీలక పాత్ర పోషించనున్న ‘పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్’.. పట్టణంలో ఏర్పాటు చేసిన 77 సి.సి కెమెరాలు సెంటర్ కు అనుసంధానం..
ఈ సందర్బంగా కర్నూలు రేంజ్ డి.ఐ.జి శ్రీ డా. కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ టెక్నాలజీ వాడడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నదన్నారు.
డిపార్ట్మెంట్ నినాదం “ఇన్విసిబుల్ పోలీస్ – విసిబుల్ పోలీసింగ్” అంటే పోలీస్ కనిపించకున్న తన డ్యూటీ కనిపిస్తే చాలు అని ఆ విధంగా కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుండి పట్టణం మొత్తాన్ని డేగ కళ్ళతో పహారా కాస్తుంటారని తెలిపారు.
ఈ సందర్భంగా ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన 20 లక్షల నిధులను తన కష్టార్జితాన్ని కేటాయించి పోలీస్ డిపార్ట్మెంట్ కు సహకరించినందుకు గౌరవ శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల పనితీరును గమనించి ఈ మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి పూర్తి చేసిన డిఎస్పీ రాజేంద్రనాథ్, పట్టణ సి ఐ కె. రమణారెడ్డి, ఎస్సై చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖకు మౌళిక వసతుల కల్పనలో కొన్ని పరిమితులు పరిధులు వుంటాయని అటువంటప్పుడు గౌరవ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ లాంటి వారు విధి నిర్వహణకు అవరమయ్యే వాటిని సమకూర్చడం గొప్ప విషయమని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తమ ఉన్నతాధికారి కర్నూల్ రేంజ్ DIG శ్రీ డా. కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారి చేతులమీదుగా జరగడం అందులో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
స్థానిక శాసనసభ్యుల గురించి జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజల భద్రత పట్ల బాధ్యత తీసుకుని పోలీస్ సిబ్బందికి విధుల నిర్వహణలో ఒక అజేయ అస్త్రం లా ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు సాయం చేయడం….పోలీస్ శాఖకు నేరస్థుల ఆట కట్టించడానికి అదనపు శక్తి ఇచ్చినట్లే అని పేర్కొన్నారు.
సెంటర్ ఏర్పాటుకు పోలీస్ శాఖకు సహకరించి స్వంత నిధులు సమకూర్చిన మైదుకూరు ఎం.ఎల్.ఏ శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారితో పాటు కర్నూలు రేంజ్ డి.ఐ.జి శ్రీ డా.కోయ ప్రవీణ్ ఐ.పి.ఎస్ గారిని, జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఐ.పి.ఎస్ గారిని, అడిషనల్ ఎస్.పి (అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారిని, మైదుకూరు మునిసిపల్ కమిషనర్ రంగ స్వామి గారిని డి.ఎస్.పి శ్రీ జి.రాజేంద్రప్రసాద్ గారు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందచేశారు.
కార్యక్రమంలో మైదుకూరు సబ్ డివిజన్ లోని సి.ఐలు, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


