సైదాపురం మండలంలో ఆటో బోల్తా – 15 మంది కూలీలకు గాయాలు.
నెల్లూరు జిల్లా, సైదాపురం మండలం:
అనంతమడుగు నుండి కొనగలూరు వెళ్తున్న కూలీలతో కూడిన ఆటో కలిచేడు మసీదు వద్ద అదుపుతప్పి తూములోకి జారిపడి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మైనింగ్ కార్మికులు గాయపడ్డారు. అందులో ఇద్దరు పురుషులు, ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా, మిగతావారికి తేలికపాటి గాయాలయ్యాయి.

