Sunday, 7 December 2025
  • Home  
  • సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి
- విశాఖపట్నం

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * – ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులకూ చేయూత ఇస్తాం – కొండపల్లి శ్రీనివాసరావు, ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్, శాఖల మంత్రి సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఉన్న ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్ తదితర శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల మేళాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్, పాట్నర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. రైతులకు చేయూత ఇవ్వడం లో తమ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. గ్రామీణ రైతుల ఎఫ్ పిఒల ద్వారా గ్లోబల్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులను తయారు చేసే వారికి చేయూత ఇస్తాం అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం సెక్రటరీ చిరంజీవి చౌదరి, రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, నాబార్డ్ రిటైర్డ్ ఎం డి సూర్య కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, అవని ఆర్గానిక్స్ ఉషా గజపతి రాజులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ ఉత్తరాంధ్ర ఎక్జీక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, కార్యదర్శి పాలెం అశోక్, ప్రకృతి రైతులు పిఎల్ఎన్ రాజు, ఎన్ నరేంద్ర, రిషి, శంకర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ప్రకృతి రైతులు , సిద్ధ వైద్యులు పాల్గొన్నారు. ఈ మేళా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వారాహి ఫెడరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హలొ వైజాగ్, టెర్రస్ గార్డెన్ గ్రూప్ లు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, అగ్రి డిఎన్ఎ వెంచర్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు

సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఆస్తి
*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- *
– ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులకూ చేయూత ఇస్తాం
– కొండపల్లి శ్రీనివాసరావు, ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్, శాఖల మంత్రి
సేంద్రీయ రైతులు మన రాష్ట్రానికి ఉన్న ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్ తదితర శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రకృతి పంటల మేళాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్, పాట్నర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా చాలా ప్రాజెక్ట్స్ ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. రైతులకు చేయూత ఇవ్వడం లో తమ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. గ్రామీణ రైతుల ఎఫ్ పిఒల ద్వారా గ్లోబల్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి రైతులకూ, ప్రకృతి పంటలతో ఉత్పత్తులను తయారు చేసే వారికి చేయూత ఇస్తాం అని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం సెక్రటరీ చిరంజీవి చౌదరి, రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయకుమార్, నాబార్డ్ రిటైర్డ్ ఎం డి సూర్య కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి, అవని ఆర్గానిక్స్ ఉషా గజపతి రాజులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ ఉత్తరాంధ్ర ఎక్జీక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరి రామకృష్ణ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, కార్యదర్శి పాలెం అశోక్, ప్రకృతి రైతులు పిఎల్ఎన్ రాజు, ఎన్ నరేంద్ర, రిషి, శంకర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ప్రకృతి రైతులు , సిద్ధ వైద్యులు పాల్గొన్నారు.
ఈ మేళా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, వారాహి ఫెడరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హలొ వైజాగ్, టెర్రస్ గార్డెన్ గ్రూప్ లు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ, అగ్రి డిఎన్ఎ వెంచర్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.