పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం
రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం నాడు ఫార్మసీ రంగంలో ఆధునిక సాంకేతికతల పై అవగాహన పెంపొందించేందుకు ” నియంత్రణ సంసిద్ధత కోసం AI, 3D ప్రింటింగ్ మరియు నాణ్యత హామిని ఏకీకృతం చేయడం” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ఘనంగా ప్రారంభించారు. ఈ సరస్సును ఫారసీ కళాశాల అనాలసిస్ 2 కెమిస్ట్రీ విభాగం మరియు IQAC, IIC మరియు RED సెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సు మొదటి రోజున జార్ఖండ్ ఉషా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ నాగరాజన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఔషధ పరిశోధనలో ఆధునిక విధానాలపై ప్రసంగించారు. అనంతరం వ్యక్తిగతీకరించిన ఔషధ రూపాల తయారీలో 30 ప్రింటింగ్ వినియోగం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు తమ పరిశోధనలపై మౌఖిక మరియు ఈ- పోస్టర్ ప్రదర్శనలు ఇచ్చారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ యిం. నీరంజన్ బాబు మాట్లాడుతూ ఫార్మసీ రంగంతో జరుగుతున్న సాంకేతిక పురోగతలను విద్యార్థులు, పరిశోధకులు మరియు పరిశ్రమల నిపుణుల పంచుకునేందుకు. ఈ సరస్సు వేదికగా సిలుస్తుందని తెలిపారు. వివిధ ఫార్మసి కళాశాలల నుండి విద్యార్థుల, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు..




