పున్నమి ప్రతినిధి 31 మార్చి రామచంద్రపురం మండలం
వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో మంగళవారం నాడు కళాశాల ఫార్మాకాలజీ విభాగం ఆధ్వర్యంలో, జంతు ప్రయోగాల నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీ ( సి సి ఎస్ ఈ ఏ)సహకారంతో “ఫార్మకాలజీలో జంతు పరిశోధన, నైతికత మరియు శాస్త్రానికి మధ్య “సమతుల్యం” అనే అంశంపై ఒక రోజు సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో వక్తలుగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఫార్మా స్యూటికల్ టెక్నాలజీకి చెందిన డి. సుజాత, చెన్నై కేకే కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ప్రేమ్ కుమార్, గుంటూరు చెబ్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ కళాణాలకు చెందిన సందీప్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటికి చెందిన ఆర్.వి. సురేష్ కుమార్ హజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జంతు ప్రయోగాల్లో రిఫైన్ మెంట్ యొక్క ప్రాముఖ్యతను, బయో మెడికల్ పరిశోధనలో నైతికత మరియు జంతు సంక్షేమం పై అవగాహన “కల్పించారు. ఈ సదస్సులో వివిధ కళాశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ పరిశోధనలను ఈ- పోస్టర్ రూపంలో ప్రదర్శించి, శాస్త్రీయి చర్చలో చురుకుగా పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాజ, ఫార్మకాలజీ విభాగాధిపతి జ్యోతి బసిని బోధన సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



