ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ తిరుమల :
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.


