రానున్న రెండు రోజుల్లో జిల్లాలో సెన్యార్ తుఫాన్ ప్రభావం ఉంటుందని శ్రీకాళహస్తి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు జనార్థన్‌రాజు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.బంగాళాఖాతంలో సేన్యార్ తుఫా హెచ్చరికలు ఉందని ఈ సమయంలో మండల ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.మండల, గ్రామస్థాయి, అధికారులు,సచివాలయ సిబ్బంది తుఫాన్ పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానవ నష్టం,జంతునష్టం నివారించేందుకు పనిచేయాలన్నారు.అదే విధంగా తుఫాన్ ప్రభావంపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. తహసీల్దారు కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని ప్రజలు ఏదైనా అవసరం ఉంటే 9491077045 నెంబరును సంప్రదించాలన్నారు.

సెన్యార్ తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగాఉండాలి:తహసీల్దారు