గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
ఉక్కునగరం సెక్టర్–11లోని సృష్టి వరల్డ్ స్కూల్లో క్రిస్మస్ పండుగను భక్తి భావాలతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ, బాల యేసు జన్మ వృత్తాంతాన్ని నాటికగా ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పశువుల పాక సందర్శకులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ పి. సుశీలా రాణి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఈ. చంద్రిక, ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్ డి. కిరణ్, చీఫ్ అకాడమిక్ హెడ్ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


