సూర్యాపేట :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
సూర్యాపేట పట్టణంలో ఆదివారం (10ఆగస్ట్ 2025) నాడు బోనాల పండుగ సంబరం అత్యంత వైభవంగా జరిగింది. రాఖి పండుగకి పుట్టినింటికి వచ్చిన ఆడబిడ్డలకి బోనస్ గా బోనాల పండుగను పుట్టినింటిలో జరుపుకునే అదృష్టం కలిగింది. కానీ బోనాలు జరిగే దేవాలయ పరిసర ప్రాంతాలలో పరిశుభ్రతను గాలికి వదిలేసారు. కనీసము భక్తులు ఇచ్చే కానుకలతోనైనా దేవాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉండేటట్లు ఆలయ పాలకమండలి సభ్యులు మరియు అధికారులు కృషి చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.


