*”
*అనపర్తి తిలక్ రెడ్డి వర్తక సంఘం కళ్యాణ మండపoలో జిల్లా వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన”సూపర్ GST – సూపర్ సేవింగ్స్” అవగాహన సదస్సులో పాల్గొన్ని, “సూపర్ GST – సూపర్ సేవింగ్స్” కర పత్రాలను ఆవిష్కరించిన అనపర్తి శాసనసభ్యులు,నెక్స్ట్ జనరేషన్ GST ప్రచార్ అభియాన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ కో-కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర.*
ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ…
మన దేశం అగ్రదేశంగా ఎదుగుతున్న నేపథ్యంలో కొన్ని అగ్ర దేశాలలో నెలకొన్న అసూయతో భారత్ ని ఒంటరి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ గారి సమర్థతతో భారత్ విశ్వ గురు స్థానాన్ని ఆక్రమించడం జరుగుతుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన వీటో సభకు 176 దేశాలు హాజరైతే అందులో 146 దేశాల మద్దతుని సాధించడం ద్వారా భారతదేశo ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతటి గుర్తింపు పొందిందో మనందరం గ్రహించవలసిన అవసరం ఉంది. ఆ సమావేశంలో ఒకటి రెండు దేశాలు పగతో రగిలిపోయినప్పటికీ చైనా గాని, రష్యా గాని భారత్ కు బలమైన మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశాన్ని ఒక అగ్ర దేశంగా తీర్చిదిద్దిన వైనాన్ని మనందరం చూస్తూ ఉన్నాం.ఆర్థిక రంగంలో నాలుగో స్థానానికి ఎదిగాం. రక్షణ రంగంలో బలమైన శక్తిగా మన దేశాన్ని తీర్చిదిద్దం ద్వారా నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వానికి ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించిన రాష్ట్రాలు వారి జీఎస్టీ మండలి మద్దతు తెలియ చెప్పాలని ఒక ఆలోచనతో జిఎస్టి మండల సమావేశానికి తమ వ్యతిరేకత తెలియ చెప్పాడానికి వచ్చినప్పటికీ అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విధానం చూసి వారు కూడా ఏకగ్రీవంగా జిఎస్టి మండలి లో ఈ సంవత్సరం ఆమోదం తెలపడం అనేది ఇవాళ నరేంద్ర మోడీ గారి సమర్థ నాయకత్వంకి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రతిపక్ష ఆర్ధిక శాఖ మంత్రులను ఎoతగానో కృషి చేసి వారిని ఒప్పించడం జరిగింది.
ఇవాళ ఒక పక్క రక్షణ రంగం,ఒక పక్క ఆర్థిక రంగం బలోపేతంగా ఉండడమే కాకుండా ఇవాళ సంక్షేమాన్ని సామాన్య ప్రజానికానికి అందిస్తూ, మరో పక్క అభివృద్ధిని అందిస్తూ, మరో పక్క సేవారంగంలో ఈ విధమైన సంస్కరణను తీసుకురావడంతో ఒక సుపరిపాలనని అందిస్తూ నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల కాలం ఒక అమృత కాలమని అనడానికి ఇవాళ జీఎస్టీ తగ్గింపు సంస్కరణలలో ఏ విధమైన మార్పులు తీసుకువస్తున్నాయో దేశ ప్రజానికానికి అందరికీ తెలియజేస్తూన్నాను.
ముఖ్యంగా క్యాన్సర్ కు ఉపయోగించే పరికరాలు గాని,ఇతర వైద్య సేవలు గాని వాటన్నిoటికీ సంబంధించి 18% ఉన్న జీఎస్టీను జీరో % కు తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రోగులకు ఉపశమనం కలిగించే చర్యలను నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది.
అదేవిధంగా అనేక రకమైన మెడికల్ కిట్స్ ఉన్నాయి ఆ మెడికల్ కిట్స్ అన్నింటిపై 12% ఉన్న జీఎస్టీని 5% తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఇవాళ ఉపయోగకరంగా ఉండేలా చేయడం జరిగింది.అదేవిధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి ఏదైతే భారతదేశం వ్యవసాయం ప్రాధాన్యత కలిగిన దేశం. ముందు దానికి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి ఏదైతే పనిముట్లు గాని, ఇతర వాటికి వాడతా ఉన్నామో దానికి సంబంధించిన జిఎస్టిని 18% నుంచి 5 % కు తీసుకురావడం జరిగింది.
ముఖ్యంగా గృహ ఉపకారణలు ఏదైతే విద్యుత్ పరికరాలు ఉన్నాయి వాటి పైన కూడా 25% ఉన్న టాక్స్ ఇవాళ 18% కు తీసుకురావడం జరిగింది. అనేక వస్తువులు ఇవాళ ముఖ్యంగా సామాజిక ప్రజానీకానికి నిత్యవసర వస్తువులు అదే విధంగా ఆరోగ్య రంగానికి సంబంధించి పూర్తిగా తొలగింపుతో పాటు ఇవాళ ఖరీదైన కార్ల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున తగ్గే పరిస్థితి వచ్చింది.
ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దాదాపుగా 50 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని నష్టపోతున్న కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు సేవ అనే దృక్పథంతో ఒక సేవ భావంతో ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చాలని ఒక సత్సంకల్పంతో ఎంత పెద్ద ఎత్తున ఈ సంస్కరణకు పూనుకోవడం జరిగింది.ముఖ్యంగా ఈరోజు వర్తకులకు, కూటమి నాయకులకు అవాగాహన కలిపించడం కోసం వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
ఈ సమావేశలో జిల్లా వాణిజ్య శాఖ అధికారులు, అనపర్తి నియోజకవర్గం వర్తకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


