తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
అనపర్తి, డిసెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) :
అనపర్తి ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలిపోయి గాయలై చికిత్స పొందుతున్న పెన్షన్ లబ్దిదారు వడ్డీ మేరీకి పెన్షన్ రూ.4000 మరియు బిక్కవోలు టిడిపి గ్రామ శాఖ ఆధ్వర్యంలో రూ.5000 లను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిక్కవోలు గ్రామ కూటమి నాయకులు.
ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ…
ప్రతి నెలా ఒకటో తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా గతంలో వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే పింఛన్ల పంపిణీ జరగదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దానికి భిన్నంగా ఇవాళ సచివాలయ ఉద్యోగులు గాని వారికి సహకారం అందిస్తున్న కూటమి నాయకులు వల్ల కానీ సక్రమంగా పంపిణీ జరుగుతోంది దానికి ఒక ఉదాహరణ ఈరోజు ఇక్కడ జరిగిన వ్యవహారం. బిక్కవోలు తోటపేటకి చెందిన వడ్డీ మేరీ అనే మహిళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారు. వారి ఇల్లు గత నాలుగు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురవటం అగ్ని ప్రమాదానికి గురైన పరిస్థితులలో ఆవిడ ఒంటిపైన గాయాలు కావడం జరిగింది. ఆవిడ ఇక్కడ అనపర్తి ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆ పెన్షన్ సచివాలయ ఉద్యోగి, కూటమి నాయకులు కలిసి వచ్చి ఇక్కడ అందివ్వడం జరిగింది. నాలుగు వేల రూపాయలు 12 గంటలకి ఇవ్వడం జరిగింది. ఉదయం అంతా గ్రామంలో 85 – 90% పెన్షన్ పంపిణీల కార్యక్రమం పూర్తిచేసి ఇప్పుడు ఈ విధంగా హాస్పిటల్ లో ఉన్న వారికి ఇబ్బందులలో ఉన్న వారికి గాని లబ్ధిదారులకు అందరికీ అందించే దిశగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.
సక్రమమైన విధానంలో ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి అవసరం లేకుండా ఇవాళ ప్రభుత్వం సక్రమంగా పెన్షన్ల పంపిణీ చేస్తుంది. గతంలో దీనిని రూ.3000 పెన్షన్ ఇస్తానని దానికి నాలుగు సంవత్సరాలు సమయం తీసుకుంటే ఇవాళ రూ.4000 పెన్షన్ ఇస్తానని వచ్చిన 12 రోజులకే నిర్ణయం తీసుకుని సక్రమంగా ప్రతినెలా 1వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆరోజు సెలవు అయితే ముందు రోజునే సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు జరిగిన సంఘటన ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇవ్వటం జరిగిందో సూపర్ సిక్స్ – సూపర్ హిట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు.


